P Krishna
Prakasam Crime News: ఈ మధ్య యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని జంటలు మాత్రం పెద్దలను ఎదిరించలేక.. తమ ప్రేమను కాదనుకోలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
Prakasam Crime News: ఈ మధ్య యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని జంటలు మాత్రం పెద్దలను ఎదిరించలేక.. తమ ప్రేమను కాదనుకోలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
P Krishna
ఈ మద్యకాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేటి సమాజంలో చాలా మంది యువత ప్రేమ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం కన్నా ప్రేమ పెళ్లిళ్లకే జై కొడుతున్నారు. అందుకోసం పెద్దలను ఎదిరించి పారిపోయి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది పెద్దలను ఎదిరించలేక.. తమ ప్రేమను కాదనుకోలేక ఆత్మహత్యలకు పాల్పుడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా ప్రేమించిన వ్యక్తితో బలవన్మరణానికి పాల్పపడింది ఓ యువతి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి.. పెళ్లికి బంధువులు తరలి వచ్చారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అంతలోనే వారికి ఓ దుర్వార్త తెలిసింది. పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలియగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏప్రిల్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రేమించిన యువకుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పపడింది ఓ యువతి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పిచ్చిగుంట్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిచ్చిగుంట్లపల్లి గ్రామానికి చెందిన నారు వెంకట నాగేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన వాలంటీర్ జక్కుల గోపీ(22) ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియక నాగేశ్వరి తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. తల్లిదండ్రులను కాదనలేక ఒప్పుకుంది నాగేశ్వరి. కానీ పెళ్లి చేసుకోని గోపీని విడిచి ఉండలేక అతనితో కలిసి చనిపోదాని నిశ్చయించుకుంది.
ఈ క్రమంలోనే ఆదివారం పెళ్లి ఉందని తెలిసి.. గోపీతో శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఊరు శివారులో ఇద్దరూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడ్డారు. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు నారు వెంకట సుబ్బారెడ్డి, సుబ్బలక్ష్మి, వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అల్లారు ముద్దగా పెంచుకొని పెళ్లి కూతురిని చేయాల్సిన సమయంలో కాటికి పంపాల్సి వస్తుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మరోవైపు వలాంటీర్ గా పనిచేస్తున్న గోపీ కి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారి తోడ ఒకే ఒక్క కుమారుడు.. ఇలా అర్థాంతరంగా చనిపోవడం గోపీ తల్లిదండ్రులు రమణయ్య, నాగమణి కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు.