iDreamPost
android-app
ios-app

జిరాక్స్ సెంటర్ పేరుతో మరో దందా! బట్టబయలైన వ్యవహారం

జిరాక్స్ సెంటర్ పేరుతో మరో దందా! బట్టబయలైన వ్యవహారం

ఈ మధ్య జనాలు కాస్త అతి తెలివిని ప్రయోగిస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. అయితే అచ్చం ఇలాగే పని కానిచ్చిన ఓ షాపు యజమాని.. అధికారుల రాకతో అసలు వ్యవహారం బట్టబయలైంది. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు జిరాక్స్ సెంటర్ పేరుతో ఆ వ్యక్తి నడిపించిన దందా ఏంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఓ జిరాక్స్ సెంటర్ ను నడిపిస్తున్నాడు. చాలా కాలం నుంచి ఈ సెంటర్ ను నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆ షాపు యజమాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చి తన షాపులో విక్రయిస్తున్నాడు. ఈ దందాను ఆ యజమాని గత కొన్ని రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ జిరాక్స్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపడింది. జిరాక్స్ ఉంచిన 150 ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జిరాక్స్ సెంటర్ యజమానిని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.