iDreamPost
android-app
ios-app

వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పూర్తి చేసిన మేఘా సంస్థ!

Subbaiah Veligonda Project: ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తైయితే మూడు జిల్లాల ప్రజలకు ఉపయోగ పడనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు చురుగ్గా జరుగుతోన్నాయి.

Subbaiah Veligonda Project: ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తైయితే మూడు జిల్లాల ప్రజలకు ఉపయోగ పడనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు చురుగ్గా జరుగుతోన్నాయి.

వెలుగొండ  ప్రాజెక్ట్ రెండో టన్నెల్  పూర్తి చేసిన మేఘా సంస్థ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టల్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి. ఇది పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం డివిజన్ లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లో మేఘా  బ్రేక్ త్రూ  మంగళవారం జరిగింది. దీనితో ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్  నిర్మాణం చిన్న చిన్న పనులు మినహా  పూర్తైంది. రెండు టన్నెల్స్  నిర్మాణాన్ని టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా  మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్  లిమిటెడ్ పూర్తి చేసింది.

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్  ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు  రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. తొలి  టన్నెల్ ఏడు డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9.2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18. 82 కిలోమీటర్లు. తోలి టన్నెల్ నుంచి మూడు వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కులు చొప్పున్ రోజుకు ఒక టిఎంసి  నీటిని తరలించేలా వీటిని  రూపొందించారు.

2019లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తరువాత రెండు టన్నెల్స్ పనులు మేఘా సంస్థ చేపట్టింది. తొలి  టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3. 6 కిలోమీటర్ల తవ్వకాన్ని ఈ సంస్థ పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది.  ఆ  తరువాత రెండో టన్నెల్ పనులు  ప్రారంభించి మంగళవారం బ్రేక్ త్రూ సాధించింది. ఈ టన్నెల్స్ పూర్తి అయ్యి  శ్రీశైలం జలాశయం నుంచి నీటి  తరలింపు ప్రారంభము అయితే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు సాగు నీరు అందుతుంది. ప్రకాశం జిల్లాలో 3. 5 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 80 వేల ఎకరాలు, కడప జిల్లాలో 30 వేల  ఎకరాలకు సాగునీరు వెలుగొండ ప్రాజెక్ట్ వల్ల లభిస్తుంది. ఈ మూడు జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది  ప్రజలకు తాగు నీరు అందుతుంది.

2020లో  మొదటి టన్నెల్ లో 3. 6 కి.మీ,  రెండో టన్నెల్ లో 7.5 కిలోమీటర్ల  పనులు చేపట్టిన ఎంఈఐఎల్ విజయవంతంగా పూర్తి చేసింది. టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన అధికారులు, కాంట్రాక్టు సంస్థ, సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది. ఇక టన్నెన్ ను పూర్తి చేసేందుకు ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగించారు. ఇది 39 మీటర్ల పొడవు ఉంది. టన్నెల్ తవ్వకం సమయంలో వచ్చే రాళ్లు, మట్టిని ఈ బెల్ట్  బయటకు తీసుకొస్తుంది.

ప్రాజెక్ట్ లో పనిచేసే సిబ్బందిని శ్రీశైలం డ్యామ్ నుంచి స్పీడ్ బోట్స్ ద్వారా తరలించింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు  ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం నుంచి  కార్మికులు సిబ్బందిని తీసుకురావాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. ప్రాజెక్ట్ అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. ఆ నిబంధలు పాటిస్తూనే ఎంఈఐఎల్ పనులు పూర్తి చేసింది. ప్రతి సంవత్సరం వచ్చే భారీ వర్షాలు, వరదల ప్రభావం కూడా  పనులపై పడకుండా మేఘా సంస్థ చర్యలు చేపట్టింది. ఆవిధంగా వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లను  ఈ సంస్థ పూర్తి చేసింది.  మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.