iDreamPost
android-app
ios-app

సమయస్పూర్తితో 32మంది ప్రాణాలు కాపాడాడు.. శభాష్ డ్రైవరన్నా..!

  • Published Apr 29, 2024 | 11:20 AM Updated Updated Apr 29, 2024 | 11:23 AM

Bus Fire Accident: వేసవి కాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రత వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. బస్సులు ఇతర పెద్ద పెద్ద వాహనాల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం చూస్తూనే ఉంటాం.

Bus Fire Accident: వేసవి కాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రత వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. బస్సులు ఇతర పెద్ద పెద్ద వాహనాల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం చూస్తూనే ఉంటాం.

  • Published Apr 29, 2024 | 11:20 AMUpdated Apr 29, 2024 | 11:23 AM
సమయస్పూర్తితో 32మంది ప్రాణాలు కాపాడాడు.. శభాష్ డ్రైవరన్నా..!

దేశంలో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండ వేడి వల్ల కొన్ని వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు రావడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురైతున్నారు. ఈ మద్య తరుచూ బస్సులు, కార్లల్లో షాట్ సర్యూట్ కారణంగా అగ్రి ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో డ్రైవర్లు సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదాలు తప్పిపోతున్నాయి. అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. హఠాత్తుగా బస్సుల్లో మంటలు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఆ సమయంలో డ్రైవర్ తెగువ చూపించాడు. అసలు ఏం జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ కి బయలుదేరింది. కొద్ది సమయం తర్వాత బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన టంగుటూరి మండలం సూరారెడ్డి పాలం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సూరారెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు లోపల నుంచి మంటలు రావడం గమనించి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కాపాడండి అంటూ అర్తనాదాలు చేశారు. అది గమనించిన డ్రైవర్ వెంటనే సమయస్ఫూర్తితో బస్సును సురక్షిత ప్రదేశంలో ఆపివేసి ప్రయాణికులను జాగ్రత్తగా కిందకు దింపాడు. ఆ సమయంలో బస్సులు 32 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఈ విషయం అగ్నిమాకప సిబ్బందికి తెలియజేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఇంజన్ లో షార్ట్‌సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. బస్సులోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి.. వారందరినీ తమ గమ్యస్థానాలకు పంపించారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉండి 32 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడినందుకు అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు. నువు రియల్ హీరో డ్రైవర్ అన్నా అంటూ ప్రశంసించారు. సాధారణంగా ఎండాకాలంలో తరుచూ బస్సుల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.