iDreamPost
android-app
ios-app

ఘోరం: వివాహేతర సంబంధం.. ఈ మహిళ ఎంతకు తెగించిందంటే?

  • Published Dec 04, 2023 | 4:56 PM Updated Updated Dec 04, 2023 | 4:56 PM

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ రాత్రికి ఇంటికి ఇచ్చిన తన ప్రియుడిపై కిరాతకానికి ఒడిగట్టింది. అసలేం జరిగిందంటే?

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ రాత్రికి ఇంటికి ఇచ్చిన తన ప్రియుడిపై కిరాతకానికి ఒడిగట్టింది. అసలేం జరిగిందంటే?

  • Published Dec 04, 2023 | 4:56 PMUpdated Dec 04, 2023 | 4:56 PM
ఘోరం: వివాహేతర సంబంధం.. ఈ మహిళ ఎంతకు తెగించిందంటే?

సమాజంలో జరుగుతున్నదారుణాలు చూస్తుంటే అసలు మనం ఉన్నది మనుషుల మధ్యేనా అన్న అనుమానులు రేకెత్తుతున్నాయి. వావి వరసలు మరిచి చెల్లి, తల్లి అనే తేడా లేకుండా వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఇక వీటి నేపథ్యంలోనే హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కురిచేడు పరిధిలోని బోయపాలెంలో బొనిగిల లక్ష్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఏడుకొండలు అనే కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే.. లక్ష్మమ్మ ఇదే గ్రామానికి చెందిన రేకుల పెద్ద అంకయ్య(40)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇలా వీరి అక్రమ సంబంధం కొన్నాళ్ల నుంచి సీక్రెట్ గా కొనసాగుతూ వచ్చింది. ఇకపోతే, శనివారం రాత్రి అంకయ్య లక్ష్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరు నగదు ఇచ్చు పుచ్చుకునే విషయంలో గొడవ పడ్డారు. దీంతో కోపంతో ఊగిపోయిన అంకయ్య లక్ష్మమ్మపై దాడి చేశాడు. ఇక తట్టుకోలేకపోయిన ఆ మహిళ.. అతని మర్మాంగాలపై దాడి చేయడంతో అంకయ్య కిందపడిపోయాడు.

దీంతో వెంటనే స్పందించిన లక్ష్మమ్మ కుమారుడు ఏడుకొండలు ఇంట్లోని రోకలి బండతో అంకయ్యను కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత తల్లి, కుమారుడు కలిసి అంకయ్యది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే తెల్లారిపోవడంతో భయంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. అంకయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అనుమానంతో లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి చూడగా.. అంకయ్య శవమై కనిపించాడు. అతడిని అలా చూసి మృతుని కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.

ఈ విషయం తెలుసుని అతని భార్య సైతం గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంకయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితురాలు లక్ష్మమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడిని అతి దారుణంగా హత్య చేసి ఏం తెల్వనట్లుగా ఆత్మహత్మగా చిత్రకరించే ప్రయత్నం చేసిన లక్ష్మమ్మ కిరాతకంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom