Dharani
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కెతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా సీనియర్ నేతలను బరిలో దింపుతు.. వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నారు జగన్. ఈ క్రమంలో ప్రకాశంలో పొలిటికల్ హీట్ రాజేశారు జగన్. ఆ వివరాలు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కెతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా సీనియర్ నేతలను బరిలో దింపుతు.. వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నారు జగన్. ఈ క్రమంలో ప్రకాశంలో పొలిటికల్ హీట్ రాజేశారు జగన్. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఏప్రిల్‌లో చివరి నాటికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయని భావిస్తున్నారు. 2019లో గెలిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే వెల్లడైన సర్వేలన్నీ జగన్‌కే జై కొడుతున్నాయి. వైసీపీ పాలనపై అత్యధిక శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పని తీరును అంచనా వేస్తూ.. నియోజవర్గాల్లో వారి గ్రాఫ్‌ను పరిశీలిస్తూ.. అవసరమైన మార్పులు, కూర్పులు చేస్తూ.. అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలు అంటూ ఓ ఆర్డర్ ప్రకారం ముందుకు సాగుతున్నారు.
ఇక రాష్ట్రంలోని ముఖ్యమైన, వైసీపీ కంచుకోటల్లో.. బలమైన నేతలకు గెలుపు బాధ్యతలు అప్పగిస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ప్రకాశంలో వైసీపీలోనే బలమైన నేతను రంగంలోకి దింపారు. ఇప్పుడు ఆయన తాను ఒక్కడే సైన్యంగా పని చేస్తూ.. మౌనంగానే టీడీపీని ముంచేస్తున్నాడు. మరి ఇంతకు ఎవరా నేత.. జగన్ ఆయన్ని అంత బలంగా నమ్మడానికి కారణం ఏంటి.. వంటి వివరాలు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనను వేగవంతం చేశారు సీఎం జగన్. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్.. ఈ ఎన్నికల్లో అక్కడ వైసీపీని గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టారు. ఆయనను ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి.. సగం పనిని పూర్తి చేశారు సీఎం జగన్. ఇక చెవిరెడ్డి విషయానికి వస్తే.. రాజకీయాల్లో ఆయనకు అజాతశత్రువు అనే పేరు ఉంది. జనాల్లో ఆయనకు క్లీన్‌చీట్ ఉంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పీకే వంటి వారు చెవిరెడ్డి ముందు దిగదుడుపే అంటారు. నిత్యం జనాల్లో ఉంటూ.. వారి మనసెరిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు చెవిరెడ్డి.
ఇక చెవిరెడ్డి పని తీరు ఎలా ఉందంటే.. అసంతృప్తులను దారిలోకి తెచ్చుకోవడమే కాక.. పక్క పార్టీ నేతలను కూడా తనతో కలుపుకుపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చెవిరెడ్డి కార్యకర్తలను, అభిమానులను సొంత మనుషుల్లా చూసుకుంటారని.. వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారని టాక్. పోల్ మేనేజ్‌మెంట్, జనాలని కూడగట్టడంతో ఆయన తర్వాతే ఎవరైనా. మాట వినని కేడర్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అంటారు. ఈసారి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తోన్న చెవిరెడ్డి.. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే సగానికి పైగా పని పూర్తి చేశారు.
ఇక ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ప్రతి ఒక్కరు చెవిరెడ్డి అభిమాని అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో భారీ ఎత్తున జనాలకు బహుమతులు ఇస్తారు. సాయం చేయడంలో ఆయనది పెద్ద చేయి. ఇక రోనా సమయంలో చెవిరెడ్డి చేపట్టిన సహాయక చర్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. చంద్రగిరి ప్రజలకు భారీ ఎత్తున సాయం చేశారు. పైగా జనాల మదిలో ఎంతో నమ్మకస్తుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఆయన బలం అని చెబుతారు. ఎన్నికల వేళ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన చెవిరెడ్డి.. తన సొంత వ్యూహాలు, నిర్ణయాలతో జనాల్లోకి దూసుకుపోతున్నారు.
ఒక్కడే ఎన్నికల కదనరంగంలో దున్నేస్తూ.. టీడీపీని మౌనంగా సైడ్ చేస్తున్నారు చెవిరెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో వైసీపీని, చెవిరెడ్డిని ఢీకొట్టగలిగేంత శక్తివంతమై నేతలు అటు టీడీపీలో కానీ.. ఇటు జనసేనలో కానీ లేరు. ఉన్న వాళ్లని తన వ్యూహాలతో మడతపెట్టి అవతల పారేస్తూ.. ప్రకాశంలో వైసీసీ క్లీన్ స్వీప్ చేసే దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు చెవిరెడ్డి. ఈ ఎన్నికల్లో ఆయన గెలవడం మాత్రమే కాక.. వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. చెవిరెడ్డి పనితీరుపై ఆ స్థాయిలో నమ్మకం పెట్టుకోవడం సరైందే అంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఇదే కాక ప్రకాశం జిల్లా వాసులు 20 ఏళ్ల కల అయిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టకున్నారు జగన్. ఇవన్ని ప్రకాశంలో వైసీపీ క్లీన్ స్వీప్‌కు కలిసి వచ్చే అంశాలు అంటున్నారు రాజకీయ పండితులు.