రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంల భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీ అనంతరం సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తినిరేపుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ముద్రగడతో మాట్లాడానని చెప్పిన సోము.. ఇది వ్యక్తిగత భేటీ కాదని తేల్చేశారు. ముద్రగడను సోము వీర్రాజు బీజేపీకిలోకి ఆహ్వానించినట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో.. ఈ భేటీ ఫలితం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. […]
బీజేపీకి ఏపీలో ఊపు తెప్పిద్దామన్న ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఒకప్పుడు ఉద్యమ రీతిలో ఊగిపోయిన ఆయన ప్రస్తుతం కొంచెం నెమ్మదించారన్న అభిప్రాయం నెలకొంటోంది. అయితే దానిని బ్రేక్ చేస్తూ అడపాదడపా ఏదో ఒక సంచలనానికి తెరతీసే ప్రయత్నం మానడం లేదు. సోము పదవీ బాద్యతలు చేపట్టిన కొత్తలో బీజేపీలోకి వలసలు పోటెత్తుతాయని ఆ పార్టీ నాయకులతో పాటు, కొందరు రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేసారు. కానీ అందుకు భిన్నంగా […]
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఉద్యమం చేయడం వల్ల తాను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయానని, అయినా కొంత మంది పెద్దలు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రోజు తనను తిట్టిస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యమం నుంచి తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన ఆయన ఈ మేరకు ఒక లేఖను […]
చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్లు కోసం చేపట్టిన ఉద్యమ సమయంలో చెలరేగిన హింస, రైలు తగలబెట్టిన ఘటనల్లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంభందించి 2016 లో తుని పట్టణ పోలీస్ స్టేషన్ లో 7, తుని రురల్ పోలీస్ స్టేషన్ లో 39, రైల్వే పోలీస్ స్టేషన్ లో 5 కేసులు […]
అధికారంలో ఉంటే కట్టడి, లేదంటే ముట్టడి … చంద్రబాబు అధికారంలో ఉంటే వేదాలు వల్లిస్తుంటారు. ప్రజాస్వామ్యం గురించి భారీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. గత ఐదేళ్ళు, ముఖ్యంగా అర్ధరాత్రి విజయవాడకు వచ్చిన దగ్గరనుండి, అమరావతి పేరుతో రాజధానికి భూసమీకరణ వరకూ ఆ తర్వాత నాలుగేళ్ళూ చంద్రబాబు చెప్పని ప్రజాస్వామ్య నీతులు లేవు. అభివృద్ధి అంటూ ధర్నాలు, నిరసనలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన అన్నా వారిపై ఉక్కుపాదం మోపారు. భూసమీకరణతో ఉపాధి కోల్పోయిన రైతు కూలీలు, కౌలు రైతులు, చిన్న […]