iDreamPost
android-app
ios-app

ముద్రగడను నాడు అవమానించి! ఇప్పుడు ఆయన బాటలోనే TDP!

ముద్రగడను నాడు అవమానించి! ఇప్పుడు ఆయన బాటలోనే TDP!

మనం చేసేటువంటి మంచి చెడులకు కాలమే సమాధానం చెప్తుందనడానికి ఈ ఒక్క కారణం చాలు. ఎంతటి వ్యక్తినైనా కర్మ ఫలితం వెంటాడుతూనే ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా రేపు అనగా సెప్టెంబర్ 30న మోత మోగిద్దాం అని నారా లోకేష్, బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో కాపు ఉధ్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులకు బీసీ రిజర్వేషన్ సాధించడంకోసం ప్లేటు, స్పూన్ లతో సౌండ్ చేసి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ముద్రగడను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి చంద్రబాబుకు చుట్టుకుంది. బాబు అరెస్టుకు నిరసనగా ఆ నాడు ముద్రగడ ఇచ్చిన పిలుపునే టీడీపీ ఫాలో అవుతోందంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.

కాగా ప్రతియేటా కాపులకు వెయ్యి కోట్లు, రిజర్వేషన్ కలిపిస్తామన్న చంద్రబాబు మాటతప్పాడు. దీంతో ముద్రగడ ప్లేట్ స్పూన్ తో సౌండ్ చేయాలని నిరసనలకు పిలుపునిచ్చాడు. ఆ సమయంలో కాపులందరు చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఆనాడు ముద్రగడ ఇచ్చినటువంటి పిలుపును దారుణాతి దారుణంగా అవమానించింది టీడీపీ ప్రభుత్వం. ఆ రేంజ్ లో కాపుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని టీడీపీ ప్రభుత్వం ఊహించలేదు. దాంతో ఆగ్రహించిన ప్రభుత్వం ముద్రగడను కాపునేతలతో తిట్టించింది. ముద్రగడను మానసికంగా కుంగిపోయేలా కుట్రలు చేసింది బాబు అనుచర వర్గం.

అయితే ఇప్పుడు ఆనాడు ముద్రగడ ఇచ్చినటువంటి పిలుపును టీడీపీ ఫాలో అవుతోంది. బాబు అరెస్టుకు నిరసనగా ప్లేట్లు, గరిటలతో ఏదో విధంగా సౌండ్ వినిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు. బాబు అరెస్టుకు నిరసనగా ప్లేటు గరిటలతో రేపు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు సౌండ్ చేయాలని నారా లోకేష్ ప్రజలను కోరాడు. గతంలో ముద్రగడ ఇచ్చినటువంటి పిలుపును నేడు టీడీపీ ఫాలో అవుతోందంటూ ఆయన బాటలోనే తెలుగుదేశం పార్టీ అనుసరిస్తోందంటూ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.