iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్‌‌కు ముద్రగడ లేఖ. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదు!

పవన్ కళ్యాణ్‌‌కు ముద్రగడ లేఖ. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యాత్రలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పెద్దఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. అధికార పక్షంపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలు పలువురిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ కాపు నేతలను కూడా తన వ్యాఖ్యలతో రెచ్చగొట్టారు. కాపు ఉద్యామాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారంటూ వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా కాపు నేత ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. పవన్ ను వీధి రౌడీతో పోలుస్తూ ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన భాష వల్ల నష్టం తప్పితే లాభం మాత్రం ఉండదు ఉండదు అంటూ సూచించారు. కాపు నేతలు ఉద్యమాలను అడ్డుపెట్టుకుని ఎదిగారు అనే వ్యాఖ్యలను ముద్రగడ ఖండించారు. తానెప్పుడూ కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ఎదగాలని చూడలేందంటూ స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారి తాను వచ్చి ఉద్యమాలు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనకంటే ఎక్కువ బలవంతుడైన పవన్ కల్యాణ్ ఉద్యమం చేసి కాపులకు ఎందుకు రిజర్వేషన్ తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలు, ఉపయోగిస్తున్న భాషను ముద్రగడ తప్పుబట్టారు. పవన్ ఒక వీధి రౌడీ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. తాను అలాంటి భాషను ఉపయోగించడం వల్ల తనకు లాభం చేకూరకపోగా.. నష్టమే జరుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

ఎమ్మేల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యలను ముద్రగడ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ ద్వారంపూడిప పోటీ చేసి గెలిచి చూపించాలంటూ సూచించారు. అలాగే తనని సీఎం చేయాలంటూ పవన్ కోరడాన్ని ముద్రగడ పద్మనాభం ఖండించారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ తనని సీఎం చేయండి అని ఎలా అడుగుతారు అంటూ ప్రశ్నించారు. ముందు 175 స్థానాల్లో సొంతంగా పోటీ చేసి ఆ తర్వాత తనని సీఎం చేయమని ప్రజలను కోరాలంటూ ముద్రగడ పద్మనాభం సూచించారు. ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ కు లేఖ రాయడంపై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.