Arjun Suravaram
Mudragada, Pawan: శుక్రవారం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు.
Mudragada, Pawan: శుక్రవారం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు.
Arjun Suravaram
ఏపీలో ఎన్నికల సునామీ ప్రారంభమైంది. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీ మరోసారి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. అలానే వైఎస్సార్ సీపీకిలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలోకి చేరగా..శుక్రవారం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పవన్ కల్యాణ్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు, నేను రాజకీయాల్లో హీరోనంటూ ముద్రగడ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన సొంత ఊరు కిర్లంపూడిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత అక్కడి మీడియాను ఉద్దేశించి పలు అంశాలు మాట్లాడారు. ముద్రగడ మాట్లాడుతూ..” కొన్ని రోజుల క్రితం వరకు చాలా మంది నన్ను ఇంటర్య్యూ ఇవ్వమని అడిగారు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకోకుండా మీడియాతో మాట్లాడటం బాగుండదని ఆగాను. నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో పార్టీలో చేరిన తరువాత కూడా మీడియా మాట్లాడని చెప్పారు. మా ఊరిలోనే మీడియా సమావేశం నిర్వహించాలని అనుకున్నారు.
మీకు(మీడియాను ఉద్దేశిస్తూ) నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. మిమ్మల్ని నిరుత్సాహ పర్చకూడదని అనుకున్నాను. అందుకే ఈ రోజు నా సొంత ఊర్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇక వైసీపీలో చేరే విషయం గురించి మాట్లాడుకుంటే.. వాస్తవానికి 14 తేదీనే చేరాల్సి ఉంది. నా చేరిక అంశంకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3 నుంచి 4 వేల వాహనాలు వస్తాయని తెలిసింది. దీనికి నేను భయపడ్డాను. ఒకవైపు పిల్లలకు పరీక్షలు అవుతున్నాయి. మా ర్యాలీ వారికి అసౌకర్యం కలిగిస్తుందని, అలాగే సీఎం ఆఫీస్ దగ్గర భద్రత సమస్యలు తలెత్తుతాయని ఆ ర్యాలీని విరమించుకున్నాను” అని తెలిపారు.
ఈ సందర్భంగా రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఆయన మండిపడ్డారు. “ మా కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది. మా కుటుంబం 1962లోనే రాజకీయాల్లోకి వచ్చింది. అప్పటికి ఇంకా ఇప్పుడున్న వాళ్లు రాజకీయ ఓనమాలు కూడా నేర్చుకోలేదు. కానీ, ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బీసీలు, దళిలితులు, కాపుల్లోని ఓ 5శాతం మంది నా వెనుకుండి..నేను ఈ స్థాయికి రావడానికి కారణయ్యారు.
కాపుల్లో కూడా పేద వాళ్లు మాత్రమే నా వెనుక ఉన్నారు. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగానే వైఎస్సార్‌సీపీలో చేరాను. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నాను. ఇంకా వైఎస్సార్ సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కానీ కొన్ని దుష్ట శక్తులు సీఎం జగన్ కు నన్ను దూరం చేశాయి. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి పవన్ ఎవరు?.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు?. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు? ఆయన సినిమాల్లో హీరో కావొచ్చు. నేను రాజకీయాల్లో హీరోను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధమంటూ ముద్రగడ ప్రకటించారు. సీఎం జగన్‌ను మళ్లీ సీఎం చేస్తామని ఈ సందర్భంగా ముద్రగడ ప్రకటించారు. మరి..పవన్ కల్యాణ్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.