ఏపీ రాజకీయాలు దేశంలోనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కారణం.. ఇక్కడ ఉన్న అధికార, ప్రతిపక్షాల మధ్య సాగే పొలిటికల్ వార్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక అధికార వైసీపీకి, ప్రతిపక్ష పార్టీలు జనసేన, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అలానే మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలను జరగనున్న వేళ.. ఈ పొలిటికల్ హీట్ సమ్మర్ హీట్ ను మించి పోయింది. వర్షకాలంలోనూ ఏపీ రాజకీయాలు మాంచి వేడిని పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ ఇద్దరు ముఖ్యనేతల భేటి జరిగినా.. అందరిలో ఏదో తెలియని ఆసక్తి నెలకొంటుంది. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటి జరిగింది.
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కలిశారు. విశాఖ మిందిలోని మంత్రి ఇంటికి వెళ్లిన ముద్రగడ.. అమర్నాథ్ తో సమావేశమయ్యారు. వీరిద్దరు మధ్య దాదాపు 20 నిమిషాల పాటు వర్తమాన విషయాలతో పాటుగా వివిధ అంశాలపై చర్చింకున్నారు. అయితే ఈ భేటీపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఆయన మాట్లాడుతూ… గుడివాడ కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో విశాఖ వచ్చిన సందర్భంగా మంత్రి అమర్నాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశానని ముద్రగడ తెలిపారు. అలానే తమ సమావేశంలో ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తవనకు రాలేదని ఆయన తెలిపారు. అలానే రాజకీయ అంశాలు తమ మధ్య చర్చ జరగలేదని కూడా చెప్పుకొచ్చారు.
వారి కలయిక సందర్భగా.. గుడివాడ కుటుంబతో తనకున్న స్నేహ బంధాన్ని ముద్రగడ గుర్తు చేసుకున్నారు. ఇక ముద్రగడ..తన ఇంటికి వచ్చిన సందర్భంలో మంత్రి అమర్నాథ్ ఎదురు వెళ్లి.. స్వాగతం పలికారు. గుడివాడ అప్పన్న సమకాలికులుగా ముద్రగడ పని చేశారని మంత్రి అమర్నాథ్ ప్రశంసించారు. స్థానిక కాపు నేతలతో కలసి మంత్రి.. ముద్రగడను సత్కరించి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు. అయితే ముద్రగడ, మంత్రి భేటీ ఆసక్తికరంగా మారింది. పలువురు రాజకీయ విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. మంత్రి అమర్నాథ్, ముద్రగడ భేటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే నాపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు: బ్రహ్మనాయుడు