iDreamPost
android-app
ios-app

Mudragada Padmanabham: YSRCPలోకి కాపు ఉద్యమనేత ముద్రగడ.. మూహుర్తం ఫిక్స్!

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార వైస్సార్ సీపీ ఎన్నికల రేసులో దూసుకెళ్తోంది. ఇదే సమయంలో ఏపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార వైస్సార్ సీపీ ఎన్నికల రేసులో దూసుకెళ్తోంది. ఇదే సమయంలో ఏపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Mudragada Padmanabham: YSRCPలోకి  కాపు ఉద్యమనేత ముద్రగడ.. మూహుర్తం ఫిక్స్!

ఏపీ పాలిటిక్స్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాపు ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, విపక్షాలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ఇవి  ఇక్కడి రాజకీయాలను రంజుగా మారుస్తున్నాయి. కాపు జాతికి ప్రతినిధులుగా, కాపు సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తులుగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైఎస్సార్ సీపీ ప్రయత్నిస్తోంది. కొంతకాలం క్రితం వరకు ముద్రగడ పద్మనాభం జనసేన వైపు మొగ్గు చూపినా అటు నుంచి స్పందన రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వైసీపీ నేతలు ముద్రగడతో చర్చలు జరపడంతో ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ  పద్మనాభం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా కాపు సంక్షేమం కోసం పోరాడిన నేతల్లో ముద్రగడ ముఖ్యులు. గత కొంతకాలంగా ఏపీ  రాజకీయాలు కాపు నేతల చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు కాపు నేతలను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే  ముద్రగడను కూడా అన్ని ప్రధాన పార్టీలు ఆహ్వానించాయి. ముద్రగడ తొలుత జనసేనాలోకి వెళ్లాలలని నిర్ణయించుకున్నారు. అది కూడా పవన్ కల్యాణ్ వచ్చి కలుస్తారని, ఆ తరువాత జనసేనలో ముద్రగడ చేరుతారని టాక్ వినిపించింది. అయితే పవన్ కల్యాణ్ ముద్రగడను కలవకపోవడం ఆయనను తీవ్రంగా అసంతృప్తికి గురి చేసింది.

ఇదే సమయంలో వైసీపీ నేతలు మరోసారి ముద్రగడ పద్మనాభంకి టచ్ లోకి వచ్చారు. వైసీపీ నేత జక్కంపూడి గణేశ్.. ఎంపీ మిథున్ రెడ్డిని ముద్రగడతో ఫోన్ లో మాట్లాడించారు. విశ్వసనియ వర్గాల సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి  ముద్రగడ పద్మనాభంతో ఫోన్ లో మాట్లాడి వైసీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరికకు ఎలాంటి అభ్యంతరం లేదని.. పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనావేసి నిర్ణయం తీసుకోవాలని స్పష్టత ఇచ్చారట ముద్రగడ. మొత్తంగా ముద్రగడ ఈనెల 12న వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారని టాక్. అయితే ఆయన ఎలాంటి షరతులు లేకుండానే పార్టీలోకి చేరినట్లు.. అధిష్టానం ఆదేశిస్తే మాత్రం పోటీకి సిద్ధమని చెప్పినట్లు తెలుస్తోంది.

ముద్రగడ వైఎస్సార్ సీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఒకవేళ ముద్రగడ పోటీ చేయకపోయినా ఆయన కుమారుడు పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. మొత్తంగా కాపు సామాజివర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు వైసీపీలోకి చేరుతున్నారు. ఇలా వైసీపీ కాపు ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. మరి.. వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నట్లు వస్తున్న వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.