19 ఏళ్ల శివప్రసాద్గా బ్లాక్‌బస్టర్ సినిమా KGFని చూశాడు. ఆ హీరోలాగే రాత్రికి రాత్రి పాపులర్ అవుదామనుకున్నాడు. ఈ సినిమాలో హీరోను పిల్లలు సుత్తివీరుడు అని పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో నలుగురు సెక్యూరిటీ గార్డులను నిద్రలో హత్య చేసినట్లు భావిస్తున్న సీరియల్ కిల్లర్ CCTVకి చిక్కాడు. ఈ 19 ఏళ్ల సీరియల్ కిల్లర్ KGFని చూసి, ఆ హీరోలాగే కొట్టి చంపేశాడు. హత్యచేసిన వాళ్లలోని ఒకరి మొబైల్ ఫోన్‌ను పోలీసులు ట్రాక్ చేసిన తర్వాత, భోపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున […]
మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన కొందరు మహిళా పంచాయతీ ఆఫీస్ బేరర్లు, సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఆశ్చర్యం. మహిళా సభ్యులెవరూ రాలేదు. బదులుగా, వాళ్ల భర్తలు, బావలు, మగ బంధువులతో ప్రమాణం చేయించారు. సాగర్, దామో జిల్లాల్లోని కొన్ని చోట్ల గురువారం కొందరు మహిళల భర్తలు, తండ్రులతో పాటు మగ బంధువులు ప్రమాణ స్వీకారం చేశారు. భార్యలకు బదులు భర్తల ప్రమాణ స్వీకారం వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, గగ్గోలు పుట్టింది. […]
భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు తెగిపోయి, రోడ్లు కొట్టుకుపోయి ప్రయాణాలు కష్టంగా మారాయి. దీనికి తోడు వర్ష బీభత్సానికి ప్రమాదవశాత్తు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో పడుతున్న వర్షాలకు ఒక స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were […]
భార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్తులు. రెండేళ్ల కుమారుడి ఆలనా పాలనా చూసుకునే తీరిక లేక.. ఒక పనిమనిషిని పెట్టుకున్నారు. భోజనం పెట్టి నెలకు ఐదువేలరూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పిల్లాడిని ఆయా చూసుకుంటుందన్న నమ్మకంతో ఇద్దరూ రోజూ తమ తమ డ్యూటీలకు వెళ్లొస్తున్నారు. అంతా ఓకే.. అనుకుంటున్న సమయంలో బాబులో వచ్చిన మార్పు తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది. ఆ చిన్నారి మౌన రోధన అందరిచే కంటతడి పెట్టుస్తోంది. పిల్లాడిని చూసుకునేందుకు పనిలోకి వచ్చిన ఆయా ఊహించని అరాచకానికి తెరతీసింది. తల్లిదండ్రులు […]
ఇది విన్నారా..? భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతను కాంగ్రెస్ యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అతడికి ఎందరో కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు చెప్పారు కూడా. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే అందులో ట్విస్ట్ తెలుసుకోవాల్సిందే. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ యువ విభాగ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ నేతకు వరుసగా మెసేజ్ వస్తూ ఉన్నాయి. తనకు వస్తున్న ఆ మెసేజ్‌లు చూసి ఓ ఆ నేత ఆశ్చర్చపోయారు. ఆ నేత పేరు హర్షిత్ సింహ్. […]
మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరిగింది. కరోనా మహమ్మరి నేపథ్యంలో లాక్ డౌన్ నియమాలను అనుసరించి ఓటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటి ఓటు వేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుమేర్ సింగ్ సోలంకి బిజెపి అభ్యర్థులు కాగా, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఫూల్ సింగ్ బరయ్యలను నామినేట్ […]
మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓ ఆసక్తికరైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతి ఓటు విలువైనది కావడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ సభకు హాజరకావల్సి ఉంటుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సభకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్వారంటైన్లో ఉన్న ఆయన పూర్తి పిపిఈ కిట్‌ను ధరించి, ఫుల్ ప్రొటక్షన్‌తో సభలోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యే రావడంతో.. అందరిలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా అయ్యారు. […]
దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల గడువులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ రాజ్యసభ సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార బిజెపి గుజరాత్లో ఇప్పటికే ఆపరేషన్ కమలంను విజయవంతంగా పూర్తి చేసింది.ప్రస్తుతం బిజెపి చూపు మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై పడింది. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.గతంలో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ఐదుగురు బిజెపి యేతర,కాంగ్రెసేతర ఎమ్మెల్యేలు అధికార బిజెపికి మద్దతు ప్రకటించారు.భోపాల్‌లోని […]
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న 24 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలు అధికార పీఠంపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార బిజెపి ప్రభుత్వ సారధి శివరాజ్ సింగ్ చౌహాన్,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై సంధించిన ఒక అస్త్రం బూమ్ రాంగ్ అయి తిరిగి ఆయన మెడకే చుట్టుకుంది. అధికారాన్ని చేజార్చుకోని డీలా పడిన కాంగ్రెస్‌కు అనుకోకుండా లభించిన ప్రచార అస్త్రంతో ముఖ్యమంత్రి చౌహాన్‌పై విమర్శల దాడిని తీవ్రతరం చేసి ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తుంది. […]
తెలంగాణలో ఎనిమిది జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదం దేశంలో మళ్ళీ మిడతల దండు కలకలం సృష్టిస్తుంది. ఇటీవలి వచ్చి వినుదిరిగాయని అందరూ భావించారు. కానీ మిడతల దండు మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్రకు చేరుకున్న మిడతల దండు…దాని ప్రమాదం తెలంగాణపై పడనుంది. పెంచ్ టైగర్ రిజర్వ్ జాతీయ పార్క్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు ఎడారి మిడతల దండు చేరుకుంది. జిల్లాలోని అజ్ని గ్రామంలోకి మిడతల దండు ప్రవేశించిందని, పంటలు, చెట్లపై డ్రోన్ల సహాయంతో పురుగు మందులను […]