Swetha
పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు , ఓజి ఈ రెండు సినిమాలు పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నయి. జూలై 24న హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. అలాగే సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 25 న ఓజి రానున్నట్లు అనౌన్స్ చేసేశారు.
పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు , ఓజి ఈ రెండు సినిమాలు పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నయి. జూలై 24న హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. అలాగే సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 25 న ఓజి రానున్నట్లు అనౌన్స్ చేసేశారు.
Swetha
పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు , ఓజి ఈ రెండు సినిమాలు పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నయి. జూలై 24న హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. అలాగే సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 25 న ఓజి రానున్నట్లు అనౌన్స్ చేసేశారు. అయితే అదే సెప్టెంబర్ 25న బాలయ్య అఖండ2 రాబోతుంది. ఈ కాంపిటీషన్ ముందు నుంచి ఉన్నదే. కాని ఇప్పుడు సెప్టెంబర్ 18 న చిరంజీవి విశ్వంభర రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో కచ్చితంగా ఓజి పోస్ట్ పోన్ అవుతుందనే వార్తా జోరుగా తిరుగుతుంది. మరో వైపు డివివి ఎంటర్టైన్మెంట్స్ ఆ పుకార్లకు చెక్ పెడుతూ ఎప్పటికప్పుడు ఓజి అప్డేట్స్ ఇస్తూనే ఉంది.
రీసెంట్ గా కూడా ఓ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసి మరోసారి మూవీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. పైగా హరి హర వీరమల్లు కంటే కూడా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజి బాగా ట్రెండ్ అయింది. అది కాకుండా ఓజి తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు సంబంధించిన నెంబర్లు బయటికి రావడం మరో ట్విస్ట్. బయట ఓజి గురించి ఇన్ని చర్చలు జరుగుతున్నా కూడా.. ఓజి ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. మొదటిది సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ నెలకొనడం. ఆ తర్వాత వచ్చినా అప్డేట్స్ అన్ని కూడా ఒక దానికి మించి మరొకటి ఉండడం. సో ఇలా ప్రతిదీ ఓజి కి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అటు బాలయ్య సినిమా పోటీగా ఉన్నా సరే.. హైప్ విషయంలో ప్రస్తుతం ఓజి దే పై చేయి.
అటు విశ్వంభర సెప్టెంబర్ 18 అని అంటున్నారే కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇటు ఓజి మాత్రం సెప్టెంబర్ 25 న వస్తున్నట్లు ప్రతి అప్డేట్ లోను కన్ఫర్మ్ చేస్తూనే ఉంది. సో ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టమౌతుంది. అలా అని ఇప్పుడే ఓ అంచనాకు రాలేము. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాతే మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు. ఎందుకంటే ఈ మధ్య సినిమా ఇంకో వారం రోజుల్లో విడుదల పెట్టుకుని కూడా సడెన్ గా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.