P Krishna
Students Mass Copying: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప స్థాయిలో ఉంచాల్సిన కొంతమంది గురువులు స్వార్థంతో వారి భవిష్యత్ అందకారంలో పడేలా చేస్తున్నారు. లంచాలు తీసుకొని పరీక్షల్లో మాస్ కాపియింగ్ ప్రోత్సహిస్తున్నారు.
Students Mass Copying: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప స్థాయిలో ఉంచాల్సిన కొంతమంది గురువులు స్వార్థంతో వారి భవిష్యత్ అందకారంలో పడేలా చేస్తున్నారు. లంచాలు తీసుకొని పరీక్షల్లో మాస్ కాపియింగ్ ప్రోత్సహిస్తున్నారు.
P Krishna
తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విద్యాబుద్దులు నేర్పి బంగారు భవిష్యత్ కి పునాదులు వేసేది గురువులు. అందుకే గురువుకు గొప్ప స్థానం కల్పించారు.. త్రిమూర్తులతో పోల్చారు. ఇటీవల కొంతమంది గురువులు చేస్తున్న నిర్వాకాల వల్ల ఆ పదానికి మచ్చ వస్తుంది. మద్యం సేవించి పాఠశాలకు రావడం, సహ ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థినులను లైంగికంగా వేధించడం లాంటి నీచమైన పనులు చేస్తున్నారు. మరికొంతమంది లంచాలకు తీసుకొని మాస్ కాపియింగ్ ని ప్రోత్సహించడమే కాదు.. పేపర్ లీక్ చేస్తూ విద్యార్ధుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ ఎగ్జామ్ హాల్ లో జరిగిన మాస్ కాపింగ్ కి సంబంధించిన వ్యవహారం కలకలకం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులు రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు సిద్దమైతే.. పేపర్ లీకేజ్, పరీక్షల్లో అక్రమాలు దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సీబీఐ, సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తాజాగా మధ్య ప్రదేశ్ లోని జివాజీ యూనివర్సిటీలో దారుణమైన మాస్ కాపియింగ్ జరిగినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. భింద్ లోని జివాజీ యూనివర్సిటలో నిర్వహించిన పరీక్షల్లో దారుణంగా మాస్ కాపియింగ్ సంఘటన వెలుగు చూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒకే దగ్గర చేరి పేపర్లను కాపీ కొట్టుకుంటున్నారు.
ప్రస్తుతం బీఎ, బీఎస్సీ పరీక్షలను జివాజీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. దారుణం ఏంటంటే ఇదంతా అక్కడ ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు సామూహికంగా కాపీ కొట్టినట్టు సమాచారం. ఎసడీఎం పరీక్షా కేంద్రానికి చేరుకున్నపుడు అక్కడ సాధారణంగా కనిపించింది.. అనంతరం సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలించగా అక్కడ ఉపాధ్యాయుడు కాపీ కొడుతుంటే విద్యార్థులకు ఎంకరేజ్ చేసినట్లు కనిపించింది. ఈ మొత్తం విషయం బింద్ లోని దామోహ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ లో జరినిట్లు ఎస్‌డీఎం విజయ్ సింగ్ అన్నారు.