Krishna Kowshik
ఇంట్లో పనులతో పాటు ఉద్యోగాలను చేస్తూ మల్టీ టాలెంటర్స్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు నారీమణులు. అయితే కొన్ని సార్లు వీరిని ఆటంకాలుగా మారాయి కుటుంబ సమస్యలు. వీటిని తట్టుకోలేక.. దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇంట్లో పనులతో పాటు ఉద్యోగాలను చేస్తూ మల్టీ టాలెంటర్స్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు నారీమణులు. అయితే కొన్ని సార్లు వీరిని ఆటంకాలుగా మారాయి కుటుంబ సమస్యలు. వీటిని తట్టుకోలేక.. దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Krishna Kowshik
తాము ఎందులో తీసిపోమని నిరూపిస్తున్నారు మగువలు. ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాదు.. ఆర్థికంగా భర్తకు సపోర్టునిస్తున్నారు. బయట నెగ్గుకు రాగలుగుతున్నారు కానీ కొన్ని సార్లు ఇంట్లో గెలవలేకపోతున్నారు. కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. దీంతో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన మహిళలు సైతం క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమస్యను సాల్వ్ చేసుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన అతివలు.. కుటుంబ కలహాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. బిడ్డల్ని వదిలేసి తనువు చాలిస్తున్నారు.
తాజాగా ఓ మంత్రి పీఆర్వో (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) ఒకరు ఆత్మహత్యకు ఒడిగట్టింది. సంవత్సరం పాపను వదిలేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పీఆర్వో పూజా థాపక్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడు ఆమెకు మంత్రి పీఆర్వోగా పోస్టింగ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో క్లాస్-2 ఆఫీసర్ అయిన పూజకు నిఖిల్ అనే వ్యక్తితో పెళ్లైంది. నిఖిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ (డిప్యూటీ తహశీల్దార్)గా వ్యవహరిస్తున్నాడు.
వీరు గోవిందా పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ నగర్‌లో నివాసంలో ఉంటున్నారు. వీరికి ఓ పాప ఉంది. సంసారం హాయిగా సాగిపోతున్న సమయంలో గొడవలు మొదలయ్యాయి. అయితే తరచుగా భార్యా భర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన పూజ.. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని భోపాల్ ఎయిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.