Swetha
కళామ్మతల్లి గర్వించతగిన ఎందరో విలక్షణ నటులలో కోట ఒకరు. ఈరోజు ఆయన ఇక లేరు అనే వార్తా తెలుగు ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు కోట మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సినీ సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కన్నీరు పెట్టాను నటులు లేరు. నిజంగా టాలీవుడ్ చిత్ర సీమకు కోట ఓ పెద్ద వరం అని చెప్పి తీరాల్సిందే.
కళామ్మతల్లి గర్వించతగిన ఎందరో విలక్షణ నటులలో కోట ఒకరు. ఈరోజు ఆయన ఇక లేరు అనే వార్తా తెలుగు ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు కోట మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సినీ సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కన్నీరు పెట్టాను నటులు లేరు. నిజంగా టాలీవుడ్ చిత్ర సీమకు కోట ఓ పెద్ద వరం అని చెప్పి తీరాల్సిందే.
Swetha
కళామ్మతల్లి గర్వించతగిన ఎందరో విలక్షణ నటులలో కోట ఒకరు. ఈరోజు ఆయన ఇక లేరు అనే వార్తా తెలుగు ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు కోట మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సినీ సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కన్నీరు పెట్టాను నటులు లేరు. నిజంగా టాలీవుడ్ చిత్ర సీమకు కోట ఓ పెద్ద వరం అని చెప్పి తీరాల్సిందే. ఇప్పటికి కొన్ని సినిమాల పేర్లు చెబితే అందరికి ముందు గుర్తుచ్చే నటుడు కోట.. అందులో ఆయన చేసిన అద్భుతమైన పాత్ర. అహనాపెళ్లంట సినిమా గుర్తుచేసుకుంటే అందులో ఆయన చేసిన పిసినారి లక్ష్మిపతి పాత్ర ఇప్పటికి సరదాగా గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
కొంతమంది ఆర్టిస్టులు దర్శకులకు వరం. వారికి ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే నిమిషాల్లో దానికి న్యాయం చేస్తూ ఉంటారు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దానికి ఓ అర్ధం తీసుకుని వస్తారు. కోట శ్రీనివాసరావు అలాంటి కోవకు చెందిన నటుడే. కోట తన కెరీర్ ను విలన్ పాత్రలు , సైడ్ క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి ఆ ఇమేజ్ దర్శకులలో రిజిస్టర్ అయిందంటే ఇక అవే పాత్రలు పడేవి. కానీ కోట ఆ ఏరియానే నమ్ముకోలేదు. కామిడి , సెంటిమెంట్ , పిసినారితనం ఇలా అన్ని పాత్రలలో నటించాడు. పాజిటివ్ , నెగిటివ్ ఇలా అన్ని షేడ్స్ ను కవర్ చేసిన మహా నటుడు కోట శ్రీనివాసరావు. చాలా మందికి అన్ని సినిమాలలో ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. కనీసం ఎదో ఒక సినిమాకైనా ఈసారి మనోడు అంత పెర్ఫార్మ్ చేయలేదు. అని జనం అనుకుంటూ ఉండడం వినే ఉంటాము.
కానీ కోట శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఇలాంటి రిమార్క్స్ ఒక్కటి కూడా లేదు. పాత్ర చిన్నదైనా పెద్దదైన దానికి తగినట్టు ఆ పాత్రలో ఒదిగిపోయి.. తన పాత్రకు న్యాయం చేసి వెళ్ళిపోతాడు. అయితే గత నాలుగు దశాబ్దాల పైగా చిత్ర సీమకు సేవలు అందించిన కోట ఆఖరి సినిమా ఏంటి అని అంతా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కోట ఆఖరి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ నెల విడుదల కానున్న హరి హర వీరమల్లులో ఉండబోతుందట. తానూ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. సో కోటను తెరమీద ఆఖరిగా చూడడం ఇదేనేమో. ఏదేమైనా ఇండస్ట్రీలో ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.