iDreamPost
android-app
ios-app

ఘోర ప్రమాదం.. ఆలయం గోడ కూలి.. 9 మంది చిన్నారు మృతి!

Madhya Pradesh: గతకొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తోన్నాయి. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు, ఇళ్లులు కూలిపోతున్నాయి. తాజాగా ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆలయ గోడ కూలి 9 మంది చిన్నారు మృతి చెందారు.

Madhya Pradesh: గతకొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తోన్నాయి. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు, ఇళ్లులు కూలిపోతున్నాయి. తాజాగా ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆలయ గోడ కూలి 9 మంది చిన్నారు మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. ఆలయం గోడ కూలి.. 9 మంది చిన్నారు మృతి!

గతకొన్ని రోజుల నుంచి  దేశంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. ఇది ఇలా ఉంటే  వానల కారణంగా పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇళ్లు, భవనాలు కూలిపోయి.. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఓ దంపతులు..మరుసటి రోజు కొత్త ఇంట్లోకి వెళ్తాము అనగా..ముందు రోజు వారు ఉన్న పాత ఇళ్లు కూలిపోయి మరణించారు. ఇది ఇలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆలయ గోడ కూలి 9 మంది చిన్నారులు మరణించారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని సాగర్​ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో షాహ్ పూర్ ప్రాంతంలో హర్దయాళ్ బాబా ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో అక్కడి చాలా మంది భక్తులు వచ్చి..వేడుకులను తిలకిస్తున్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న గోడ ఒకటి..ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దానికి సమీపంలో ఉన్న చాలా మంది శిథిలాకింద చిక్కుకున్నారు.  ఈ ఘటనలో 9 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే  స్థానిక పోలీసులు ఘటనస్థలానికి వెళ్లారు.

స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శిథిలాల కింద నుంచి  చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. అలానే  గాయపడిన వారిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనలో చనిపోయినా,  గాయపడిన పిల్లలలందరూ 10 నుంచి 15ఏళ్ల మధ్యలో ఉంటారని సమాచారం. ఈ ఘటనపై సాగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్​ స్పందించారు.

మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. అలానే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఘటనతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ. 4లక్షల ఆర్థిక సాయం చేస్తుందని మోహన్​ యాదవ్​ అన్నారు. ఈ హర్దయాళ్​ ఆలయం గోడలు దాదాపు 50ఏళ్ల క్రితం నాటివి అని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇదే రాష్ట్రంలోని రేవా జిల్లాలో గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా ఈ విషాదం చోటుచేసుకుంది.