iDreamPost
android-app
ios-app

వేరే కులం వ్యక్తిని పెళ్లాడిందని.. కన్నకూతుర్ని కొట్టి చంపేశారు!

  • Published Jul 05, 2024 | 4:18 PM Updated Updated Jul 05, 2024 | 4:18 PM

ఆడపిల్ల కోరితే అన్ని తెచ్చి ఇచ్చే పెరేంట్స్. . పెళ్లి మాత్రం తమ ఇష్టానికే వదిలేయాలని అనుకుంటారు. అయితే కూతురు తమను కాదని మరో వ్యక్తిని ఇష్టపడితే.. సహించలేదు. ముఖ్యంగా తమ కులానికి చెందిన వాడు కాకపోతే...

ఆడపిల్ల కోరితే అన్ని తెచ్చి ఇచ్చే పెరేంట్స్. . పెళ్లి మాత్రం తమ ఇష్టానికే వదిలేయాలని అనుకుంటారు. అయితే కూతురు తమను కాదని మరో వ్యక్తిని ఇష్టపడితే.. సహించలేదు. ముఖ్యంగా తమ కులానికి చెందిన వాడు కాకపోతే...

  • Published Jul 05, 2024 | 4:18 PMUpdated Jul 05, 2024 | 4:18 PM
వేరే కులం వ్యక్తిని పెళ్లాడిందని.. కన్నకూతుర్ని కొట్టి చంపేశారు!

దేశం అన్నిటా ముందుకు వెళుతున్నా.. కొంత మంది మానవులు మాత్రం ఆధునిక ఆలోచనల్లోనే ఉండిపోయారు. కంటికి కనబడని పురువు కోసం, అవసరాల్లో ఆదుకోని కులం, మతం కోసం వెంపర్లాడుతుంటారు. ముఖ్యంగా కులాల కుంపట్లో కొట్టుకు చస్తున్నారు. వీరితో పాటు పిల్లల్ని కూడా ఇదే మత్తులో పెంచుతుంటారు. తమ కాస్ట్ వ్యక్తితోనే మాట్లాడాలని, మనోడు, మన కులపోడు అంటూ వారి తలలపై కూడా ఈ కులోన్మాదాన్ని రుద్దుతుంటారు. చివరకు పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తే.. వారి కులానికి చెందిన వ్యక్తినైతేనే యాక్సెప్ట్ చేస్తాడు. కాదని మరో కాస్ట్ వ్యక్తిని ప్రేమించిందా.. అంతు చూడటానికి కూడా వెనకాడరు. అందుకు ఉదాహరణ అమృత, ప్రణయ్ ఘటనే. తాాజాగా మరో యువతి బలైంది.  ఈ ఘటనలో సొంత కూతుర్నే పెట్టనపెట్టుకున్నారు.  పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేశారు ఆమె పేరెంట్స్

తమ ఇష్టానికి వ్యతిరేకంగా లవ్ మ్యారేజ్ చేసుకుందన్న కోపంతో సొంత కుటుంబ సభ్యులే హత్య చేసి.. తగులబెట్టారు. ఈ ఘోరమైన సంఘటన రాజస్థాన్‌లోని ఝలావర్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 24 ఏళ్ల యువతి.. రవి భీల్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరివీ వేర్వేరు కులాలు. అయితే ఆమె ప్రేమ విషయం ఇంట్లో తెలిసి. వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించి తాను ఇష్టపడ్డ వ్యవక్తితో ఆమె వివాహం చేసుకుంది. అయితే కుటుంబ సభ్యులు ఇష్టం లేకపోవడంతో ఆమెకు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. అయితే కూతురు తమ పరువు తీసిందన్న కోపంతో ఆమెను చంపేయాలనుకున్నారు పేరెంట్స్. ఆమె మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని బ్యాంకుకు వస్తుందని తెలుసుకున్నారు.

అక్కడే ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. భార్యతో కలిసి రవి బ్యాంకు దగ్గరకు రాగానే.. అక్కడే కాపు కాసిన ఆమె బంధువులు.. భర్త కళ్లెదుటే.. భార్యను ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెను హత్య చేసి దహనం చేసేశారు. అయితే తన భార్యను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. కానీ పోలీసులు చేరుకునే సమయానికే అంతా జరిగిపోయింది. ఘటనాస్థలానికి 80 శాతానికి పైగా బాధితురాలి శవం కాలిపోయింది. పోలీసుల రాకను గమనించిన కుటుంబ సభ్యులు అక్కడి నుండి పరారయ్యారు. మృతురాలి అవశేషాలను తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ కు పంపించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరువు హత్య స్థానికంగా సంచలనం కలిగించింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom