iDreamPost
android-app
ios-app

సినిమా ప్రభావం.. ఓ స్కూల్ లో బ్యాక్ బెంచీలనే తీయించేసింది

  • Published Jul 12, 2025 | 10:49 AM Updated Updated Jul 12, 2025 | 10:49 AM

ఒక సినిమా కొంతమంది జీవితాలను మార్చేయగలదు. ఇది ఎప్పటినుంచో వింటున్నా మాట. కొన్ని సినిమాలు చూసి తాము కూడా ఓ హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారు ఎంతో మంది. కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సంగీతం , డాన్స్ నేర్చుకున్న వారు ఇంకొంతమంది. అలా అని ప్రతి సినిమా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుందని చెప్పలేము.

ఒక సినిమా కొంతమంది జీవితాలను మార్చేయగలదు. ఇది ఎప్పటినుంచో వింటున్నా మాట. కొన్ని సినిమాలు చూసి తాము కూడా ఓ హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారు ఎంతో మంది. కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సంగీతం , డాన్స్ నేర్చుకున్న వారు ఇంకొంతమంది. అలా అని ప్రతి సినిమా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుందని చెప్పలేము.

  • Published Jul 12, 2025 | 10:49 AMUpdated Jul 12, 2025 | 10:49 AM
సినిమా ప్రభావం.. ఓ స్కూల్ లో బ్యాక్ బెంచీలనే తీయించేసింది

ఒక సినిమా కొంతమంది జీవితాలను మార్చేయగలదు. ఇది ఎప్పటినుంచో వింటున్నా మాట. కొన్ని సినిమాలు చూసి తాము కూడా ఓ హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారు ఎంతో మంది. కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సంగీతం , డాన్స్ నేర్చుకున్న వారు ఇంకొంతమంది. అలా అని ప్రతి సినిమా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుందని చెప్పలేము. కానీ కొన్ని సినిమాలు నిజంగా తలుచుకుంటే ఓ సొసైటీని కూడా మార్చేయగలవు. ఇప్పుడు చెప్పుకునే విషయం గురించి తెలిస్తే.. ఓ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీదే సమాజం మీద ఇంత ఉంటుందా అని.. నోటి మీద వేలు వేసుకోక మానరు.

సాధారణంగా స్కూల్ , కాలేజీలలో లాస్ట్ బెంచర్స్ ఉంటూనే ఉంటారు. అక్కడ కూర్చుంటే చదువులో తప్ప మిగిలిన అన్నిటిలో ముందు ఉంటారని అంతా అంటూనే ఉంటారు. లాస్ట్ బెంచ్ అంటే చాలా మందికి అదొక ఎమోషన్. లాస్ట్ బెంచ్ లేని స్కూల్ కాలేజ్ ఏది ఉండదు. కానీ గత ఏడాది వచ్చిన ఓ సినిమా చూసి కేరళలోని ఓ స్కూల్ లో మొత్తం రూల్స్ నే మార్చేశారట. మలయాళీ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు ఆలోచింపచేస్తూనే ఉంటాయి. గత ఏడాది నవంబర్ లో ‘స్థానర్ది శ్రీకుట్టన్’ అనే ఓ సినిమా రిలీజ్ అయింది. కథ అంతా కూడా స్కూల్ పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

శ్రీకుట్టన్ అనే ఏడో తరగతి కుర్రాడు ఓ బ్యాక్ బెంచర్. చదువు మానేసి ఎప్పుడు ఫ్రెండ్స్ , గొడవలు అంటూ అల్లరి చేస్తూ ఉండేవాడు. అతనికి పక్కవాళ్ళతో గొడవలు , క్లాస్ లో ఇష్టపడిన అమ్మాయి, ఎప్పుడు తిట్టుకునే ఓ మాస్టర్.. వారి మధ్య జరిగే సమస్యలు వాటిని ఎలా ఓవర్ కమ్ చేశారు అనే కాన్సెప్ట్ పైనే తిరుగుతూ ఉంటుంది. సింపుల్ కథను చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఓవరాల్ గా స్కూల్ అంటే అందరూ సమానమే అని చెప్పకనే చెప్తుంది ఆ సినిమా.

ఇది ప్రేక్షకులను ఎంతలా ప్రభావితం చేసిందంటే.. కేరళలో లోని ఓ స్కూల్ లో ఇప్పుడు అసలు బ్యాక్ బెంచీలు లేవు. యు షేప్ లో బెంచీలు వేసి అందరిని కలిపి కూర్చోపెడుతున్నారు. అంతా సమానమే అనే మాటకు అర్థంపట్టేలా చేసి చూపిస్తున్నారు. ఇది పిల్లల మధ్యన డిఫరెన్స్ లేకుండా చేస్తుందట. అలాగే టీచర్స్ చెప్పే లైసన్స్ ను శ్రద్దగా వినడానికి కూడా తోడ్పడుతుందట. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇది కేరళలోని ఒక్క స్కూల్ తోనే ఆగిపోతుందా లేదా మిగిలినా స్కూల్స్ కూడా ఫాలో అవుతాయా అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.