iDreamPost
android-app
ios-app

వీడియో: ఇద్దరు మహిళలను బతికుండగానే పాతి పెట్టారు! చివరకు..

రోజు రోజుకు మనిషి రూపంలో ఉన్న క్రూర మృగాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా ఏదో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంటుంది. తాజాగా ఇద్దరు మహిళలను బతికుండగానే పూడ్చిపెట్టారు.

రోజు రోజుకు మనిషి రూపంలో ఉన్న క్రూర మృగాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా ఏదో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంటుంది. తాజాగా ఇద్దరు మహిళలను బతికుండగానే పూడ్చిపెట్టారు.

వీడియో: ఇద్దరు మహిళలను బతికుండగానే పాతి పెట్టారు! చివరకు..

నేటికాలంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే.. సమాజం ఎటువైపువెళ్తుందా అనే సందేహం కలుగక మానదు. అసలు మానవత్వం బతికే ఉందా అనే అనుమానాలు రాకమానవు. మనిషి రూపంలో  అనేక మృగాలు సమాజంలో తిరుగుతూ అమాయకులపై దాడి చేసి..హత్య చేస్తున్నాయి. తాజాగా ఇద్దరు మహిళలును బతికుండగానే భూమిలో పూడ్చిపెట్టేయాలని చూశారు. ఈ క్రమంలోనే స్థానికులు రావడంతో ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ అమానుష ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల జరుగుతున్న నేరాలకు ప్రధానమైన కారణాల్లో భూవివాదాలు ఒకటి. వీటి కారణంగా అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో హత్యాయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా హినౌతాలో భూ వివాదం ఇద్దరి మహిళలకు ప్రాణాలు పోయినంత పని చేసింది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మమతా పాండే, ఆశా పాండే  అనే ఇద్దరు మహిళలకు చెందిన భూమి చిక్కుల్లో పడింది. రహదారి అనేది తమ పొలం మీదుగా వేయడాన్ని తాము ఒప్పుకోమని ఆ మహిళలు తెలిపారు.

అంతేకాక తమ భూమి కోల్పోవాల్సి వస్తుందని ఈ రోడ్డు నిర్మాణాన్ని సదరు మహిళలు అడ్డుకున్నారు. అయితే రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్లు ఆ ఇద్దరి మహిళల ఆందోళనను పట్టించుకోలేదు. అంతేకాక స్థానిక రౌడీల అండచూసుకుని ఏకంగా ఆ మహిళలిద్దర్నీ చంపే ప్రయత్నం చేశారు. వారిద్దరిని బతికుండగానే పూడ్చి పెట్టేందుకు వారు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మట్టిని తీసేసి…నిల్చుని ఉన్న ఈ ఇద్దరు మహిళలను సగానికి పైగా మట్టితో పూడ్చేశారు. అయితే మహిళలకు వారికి మధ్య జరుగుతున్న గొడవను గమనించిన స్థానికులు అక్కడి చేరుకున్నారు. అయితే స్థానికులను చూసిన అక్కడి మాఫీయా కాస్తా వెనక్కి తగ్గింది.

ఈ ఇద్దరి మహిళ కుటుంబ సభ్యులతో పాటు, మరికొందరు స్థానికులు వచ్చి..మట్టిలో ఉండిపోయినా.. ఆ బాధితులను కాపాడారు. వారిపై రాళ్లు పడటంతో గాయాలయ్యాయి. వీరిని కాపాడిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ అమానుషానికి ప్రధాన కారకుడైన డంపర్ డ్రైవర్ ప్రదీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి.. ఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. మరి..ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.