iDreamPost
android-app
ios-app

చిత్ర సీమలో కోటకు తీరని ఒకే ఒక్క కల ఇదే

  • Published Jul 14, 2025 | 12:54 PM Updated Updated Jul 14, 2025 | 12:54 PM

పదులు ఇరవైలు కాదు వందల సంఖ్యలో సినిమాలలో నటించి కోట ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న సినిమా పెద్ద సినిమా , చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రతి హీరోతో కలిసి నటించారు. ఎత్తులు పల్లాలు , గెలుపు ఓటములు ఇలా జీవితంలో కోట అన్ని చూసేసారు.

పదులు ఇరవైలు కాదు వందల సంఖ్యలో సినిమాలలో నటించి కోట ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న సినిమా పెద్ద సినిమా , చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రతి హీరోతో కలిసి నటించారు. ఎత్తులు పల్లాలు , గెలుపు ఓటములు ఇలా జీవితంలో కోట అన్ని చూసేసారు.

  • Published Jul 14, 2025 | 12:54 PMUpdated Jul 14, 2025 | 12:54 PM
చిత్ర సీమలో కోటకు తీరని ఒకే ఒక్క కల ఇదే

పదులు ఇరవైలు కాదు వందల సంఖ్యలో సినిమాలలో నటించి కోట ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న సినిమా పెద్ద సినిమా , చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రతి హీరోతో కలిసి నటించారు. ఎత్తులు పల్లాలు , గెలుపు ఓటములు ఇలా జీవితంలో కోట అన్ని చూసేసారు. అదే అశేష ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకుని నేడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇలా కోట శ్రీనివాసరావు క్యారెక్టర్స్ పరంగా అన్ని చూసేసారు కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్క లోటు మాత్రమే అలాగే మిగిలిపోయిందట.

అదే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించడం. కోట శ్రీనివాసరావ్ ఇండస్ట్రీకి వచ్చే టైం కు ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. అందుకే అప్పుడు ఆ కలయిక సాధ్యం కాలేదు. ఇక ఆ తర్వాత 1987 లో మండలాధీశుడు అనే సినిమా వచ్చింది. అందులో టైటిల్ రోల్ పోషించింది కోట శ్రీనివాసరావే. అయితే ఈ సినిమా కాంటెక్స్ట్ అంతా కూడా ఎన్టీఆర్ ను విమర్శించేలా ఉంటుంది. సో థియేటర్స్ లో మూవీ ఆడలేదు. కోటకు ఈ విషయంలో ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేకపోయినా సరే.. ఆ పాత్ర పోషించినందుకు ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓసారి ఏకంగా ఈయన మీద దాడి కూడా చేయాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ మాత్రం చూసి చూడనట్టు ఈ విషయం గురించి పట్టించుకోలేదట

కట్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ 1990లో మరోసారి మేకప్ వేసుకున్నారు. కొన్ని సినిమాలు తీశారు కానీ వాటిలో కోట శ్రీనివాసరావుకు అవకాశం దొరకలేదు. ఆ తర్వాత కొంతలానికి మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం రాఘవేంద్ర రావు నుంచి ఓ ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు కోటకు డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పాల్సి వచ్చిందట. బహుశా ఎన్టీఆర్ ది అదే లాస్ట్ మూవీ అని చెప్పి ఉంటే.. కోట కచ్చితంగా ఆ సినిమాకు ఓకే చెప్పేవారేమో. అలా కోటకు ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది. సీనియర్ ఎన్టీఆర్ కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం కోట శ్రీనివాసరావ్ చాలానే సినిమాలు తీశారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.