iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ సంచలన నిర్ణయం.. రూ.64 కోట్ల స్కూల్‌ ఫీజు తల్లిదండ్రులకు వాపస్‌ ఇవ్వండి

  • Published Jul 12, 2024 | 9:31 AMUpdated Jul 12, 2024 | 10:32 AM

Madhya Pradesh-School Fees Return: అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వారు అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులకు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. ఆ వివరాలు..

Madhya Pradesh-School Fees Return: అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వారు అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులకు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. ఆ వివరాలు..

  • Published Jul 12, 2024 | 9:31 AMUpdated Jul 12, 2024 | 10:32 AM
ప్రభుత్వ సంచలన నిర్ణయం.. రూ.64 కోట్ల స్కూల్‌ ఫీజు తల్లిదండ్రులకు వాపస్‌ ఇవ్వండి

మన దేశంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు మోయలేని భారంగా మారినది ఏదైనా ఉందా అంటే అది వైద్యం ఖర్చు, పిల్లల స్కూల్‌ ఫీజులు. ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వం ఆస్పత్రుల్లో, పాఠశాలల్లో నాణ్యమైన వైద్య, విద్య లభించడం అంటే అత్యాశగానే ఉంది. ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో వైద్యాన్ని నెగ్లెక్ట్‌ చేయలేం.. ఇటు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో చదువు విషయంలో కూడా వెనకంజ వేసే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో అప్పు చేసైనా సరే.. నాణ్యమైన విద్య, వైద్యం కోసం ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నాం. ఇక కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో, పాఠశాలల్లో ఫీజుల దోపిడి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎల్‌కేజీకే లక్షల రూపాయల ఫీజు వసూలు చేసే విద్యా సంస్థలు మన దగ్గరే కాక దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.

ఇక ప్రతి ఏటా పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి ప్రైవేటు స్కూల్‌ ఫీజుల జులుం మీద సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం.. వంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దీనిపై ప్రభుత్వాలు సీరియస్‌గా యాక్షన్‌ తీసుకునే సందర్భాలు చాలా తక్కువ. ఈ క్రమంలో ఓ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున అధిక ఫీజు వసూళ్లకు పాల్పడిన ప్రైవేటు స్కూళ్లకు ఊహించని షాక్‌ ఇచ్చింది. సదరు పాఠశాల యాజమాన్యాలు.. తల్లిదండ్రుల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయలను తిరిగి వాపస్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

ఈ సంచలన నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.64.59 కోట్ల ఫీజులను తిరిగి వారికి తల్లిదండ్రులకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీనిలో భాగంగా జబల్​పూర్​జిల్లాలోని 10 ప్రైవేటు పాఠశాలకు ఆర్డర్స్‌ జారీ చేసింది. గత ఆరేళ్లుగా ఈ 10 పాఠశాలల యాజమాన్యాలు.. విద్యార్థుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు.. మధ్యప్రదేశ్ నిజి విద్యాలయ అధినియం–2017 (స్కూళ్​ఫీజుల రూల్స్ అమలును పరిశీలించే కమిటీ) తనిఖీల్లో గుర్తించింది.

ఇలా రూల్స్​కు వ్యతిరేకంగా వసూలు చేసిన రూ.64.59 కోట్లను.. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి రీఫండ్​ చేయాలని జబల్‌పూర్‌ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా, డీఈవో ఘనశ్యామ్ సోని ఆయా స్కూళ్లను ఆదేశించారు. ఈ సందర్భంగా డీఈఓ ఘనశ్యామ్ సోని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మధ్యప్రదేశ్ నిజి విద్యాలయ అధినియం (స్కూల్​ఫీజుల రూల్స్​ను అమలును పర్యవేక్షించే కమిటీ) 2018–19 నుంచి 2024–25 వరకు ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేసిన ట్యూషన్​, తదితర ఫీజులపై తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగా విద్యాసంస్థల అకౌంట్లను పరిశీలించగా.. 10 ప్రైవేటు స్కూళ్లు.. మొత్తం 81,117 మంది స్టూడెంట్ల నుంచి రూ. 64,58,76,812 మేర అధిక ఫీజులు వసూలు చేసినట్టు కమిటీ గుర్తించింది. ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు రీఫండ్‌ చేయాలని ఆదేశించాము’’ అని తెలిపారు.

అలానే కొన్ని పాఠశాలల్లో.. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే స్కూల్ మేనేజ్​మెంట్లు, పుస్తకాల షాపులు ఎక్కువ ధరలకు అమ్మడంపై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కొన్ని స్కూళ్లు పర్మిషన్ తీసుకోకుండా 10 శాతానికి పైగా, మరికొన్ని 15 శాతానికి పైగా ఫీజులు పెంచాయని చెప్పుకొచ్చారు. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి