Swetha
శేఖర్ కమ్ముల పుణ్యమా అని చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక అందరి ఆశలు సెకండ్ ఆఫ్ మీదే పెట్టుకున్నారు. ఇప్పటివరకు కుభేర, కన్నప్ప సినిమాలు డీసెంట్ హిట్స్ అనే టాక్ సంపాదించుకున్నాయి. ఇక నెలలో హరి హర వీరమల్లు గ్రాండ్ ఎంట్రీకి రెడీగా ఉంది. ఆ తర్వాత కింగ్డమ్ , వార్ 2 , కూలి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే సెప్టెంబర్ నెల అత్యంత కీలకంగా మారనుంది.
శేఖర్ కమ్ముల పుణ్యమా అని చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక అందరి ఆశలు సెకండ్ ఆఫ్ మీదే పెట్టుకున్నారు. ఇప్పటివరకు కుభేర, కన్నప్ప సినిమాలు డీసెంట్ హిట్స్ అనే టాక్ సంపాదించుకున్నాయి. ఇక నెలలో హరి హర వీరమల్లు గ్రాండ్ ఎంట్రీకి రెడీగా ఉంది. ఆ తర్వాత కింగ్డమ్ , వార్ 2 , కూలి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే సెప్టెంబర్ నెల అత్యంత కీలకంగా మారనుంది.
Swetha
2025 మొదటి హాఫ్ అంతా కూడా సరైన సినిమాలు లేక టాలీవుడ్ చప్పపడిపోయింది. దీనితో అటు డిస్ట్రిబ్యూటర్స్ , థియేటర్ ఓనర్స్ , నిర్మాతలు , ఆడియన్స్ అంతా డీలా పడిపోయారు. సరైన సినిమా పడేలే కానీ ప్రేక్షకులు ఆ సినిమాను ఎలా ఆదరిస్తారో సెకండ్ ఆఫ్ కు లీడ్ ఇస్తూ కుభేర చెప్పేసింది. శేఖర్ కమ్ముల పుణ్యమా అని చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక అందరి ఆశలు సెకండ్ ఆఫ్ మీదే పెట్టుకున్నారు. ఇప్పటివరకు కుభేర, కన్నప్ప సినిమాలు డీసెంట్ హిట్స్ అనే టాక్ సంపాదించుకున్నాయి. ఇక నెలలో హరి హర వీరమల్లు గ్రాండ్ ఎంట్రీకి రెడీగా ఉంది. ఆ తర్వాత కింగ్డమ్ , వార్ 2 , కూలి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే సెప్టెంబర్ నెల అత్యంత కీలకంగా మారనుంది.
ఒకే నెలలో వెంట వెంటనే ముగ్గురు స్టార్ హీరోలు రంగంలోకి దిగనున్నారు. వాటిలో పవన్కళ్యాణ్ ఓజి ఒకటి , బాలకృష్ణ అఖండ 2 ఒకటి. ఈ రెండు సినిమాలు కూడా సెప్టెంబర్ 25 న ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పుడో డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఇక రీసెంట్ గా చిరంజీవి విశ్వంభర కూడా సెప్టెంబర్ 18 లేదా 25 న రావొచ్చనే టాక్ మొదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18 న వస్తే పరవాలేదు. కనీసం ఓజి , అఖండ లకు ఓ వారం గ్యాప్ ఉంటుంది. అయితే ఓజి రాదనే నమ్మకంతోనే విశ్వంభరను దింపుతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెలలో పవన్ కళ్యాణ్ హరి హర రానుంది. మరి వెంట వెంటనే పవన్ సినిమాలు వస్తాయా అనే సందేహం కూడా ఉంది. లేదా ఒకవేళ అన్ని అనుకున్న టైం కు వచ్చిన.. అవే ఆడతాయని అనుకుంటున్నారో తెలీదు.
కానీ ఈ మూడు ఒకేసారి మాత్రం తలపడవనేది వాస్తవం. అలా అని ఎవరు తగ్గుతారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత ఇయర్ ఎండ్ లోపు స్లాట్స్ ఏమి కాళీ లేవు. డిసెంబర్ లో రాజాసాబ్ ఉంది. దీనితో ఏ సినిమా కూడా పోటీ పడదు. సంక్రాంతికి మెగా 157 ఫిక్స్ అయింది. కాబట్టి ఈలోపే విశ్వంభర రిలీజ్ చేయాలి. ఎటొచ్చి ఓజినే రాజి పడుతుందేమో అని ట్రేడ్ పండితుల అంచనా. ఇక అసలు తగ్గేదేలే అంటూ అఖండ 2 నే సెప్టెంబర్ 25 కు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిక్కులన్నీ వీడాలంటే ఇంకో నెలన్నర వెయిట్ చేయాల్సిందే. ఈ రేస్ నుంచి ఎవరు తప్పుకుంటారో .. ఎవరు రాజీకి ఒప్పుకుంటారో చూడాలి. మరి ఈ ఆప్టే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.