Swetha
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహా విషాదం చోటు చేసుకుంది. నిజంగా ఇది టాలీవుడ్ కు చీకటి రోజని చెప్పాలి. ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 వయస్సులో స్వర్గస్థులయ్యారు. ఈ 83 ఏళ్ళ ప్రయాణంలో ఆయన దాటి వచ్చిన కష్టాలు , అవమానాలు , ఆనందాలు , అవార్డులు , రివార్డులు ఎన్నో ఉన్నాయి
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహా విషాదం చోటు చేసుకుంది. నిజంగా ఇది టాలీవుడ్ కు చీకటి రోజని చెప్పాలి. ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 వయస్సులో స్వర్గస్థులయ్యారు. ఈ 83 ఏళ్ళ ప్రయాణంలో ఆయన దాటి వచ్చిన కష్టాలు , అవమానాలు , ఆనందాలు , అవార్డులు , రివార్డులు ఎన్నో ఉన్నాయి
Swetha
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహా విషాదం చోటు చేసుకుంది. నిజంగా ఇది టాలీవుడ్ కు చీకటి రోజని చెప్పాలి. ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 వయస్సులో స్వర్గస్థులయ్యారు. ఈ 83 ఏళ్ళ ప్రయాణంలో ఆయన దాటి వచ్చిన కష్టాలు , అవమానాలు , ఆనందాలు , అవార్డులు , రివార్డులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన సినీ సుదీర్ఘ ప్రయాణంలో 750 కి పైగా చిత్రాలలో నటించి అలరించారు. చిన్నతనం నుంచి నాటకాల మీద ఆసక్తి ఉన్న ఆయన.. 1978లో ప్రాణం ఖరీదు అనే చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో కొంతకాలం బ్యాంక్ ఉద్యోగంలో కొనసాగారు. ఆ తర్వాత 1985 లో మరోసారి సినీ పరిశ్రమ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. దర్శకుడు టి కృష్ణ తన సినిమాలో అవకాశం ఇచ్చారు. అది కోట శ్రీనివాసరావు సినీ కెరీర్ ను మలుపు తిప్పింది.
వందేమాతరం అనే సినిమాలో ఆయన వేసింది చిన్న పాత్ర అయినా సరే.. చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు కోట శ్రీనివాసరావు ఇంటి తలుపు తట్టాయి. ముఖ్యంగా ఉషాకిరణ్ మూవీస్ ప్రతి ఘటనలో చేసిన కాశయ్య అనే క్యారెక్టర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆయన స్థాయిని అమాంతం పెంచేసింది. అలా వరుస ఆఫర్లు రావడంతో తన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాస్ వెళ్లిపోయారు. ఇక అలా మొదలైన తన సినీ ప్రయాణం మళ్ళీ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చేసింది. అహ నా పెళ్ళంట, యముడికి మొగుడు, శత్రువు, బావ బావమరిది, మామగారు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆమె.. ఇలా తన సినీ చరిత్రలో ఒక్కో అధ్యాయంలో కొనసాగుతూనే ఉంది. ప్రతి సినిమాలోనూ ఆయన బలమైన పాత్రలే పోషించారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ , కమిడియన్ , విలన్ ఇలా ఏ పాత్ర అయినా సరే చాలా అలవోకగా ఆ పాత్రలో ఒదిగిపోయేవారు. తన సినీ ప్రస్థానంలో ఐదు సార్లు నంది అవార్డు దక్కించుకున్నారు. 2015లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందజేసింది. అలాగే సినిమాలతో పాటు అటు రాజకీయాలలో కూడా ఆయన తన సేవలు అందించారు . 1999లో విజయవాడ తూర్పు బీజీపీ ఎంఎల్ఏగా ఆయన చేశారు . అలా ఇండస్ట్రీకి కూడా ఈ విలక్షణ నటుడు .. ఎన్నో సేవలు అందించి ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు . మూడు తరాల నటులతో కలిసి పని చేసిన ఈ నట శిఖరం స్వర్గస్థులు అవ్వడం యావత్ సినీ పరిశ్రమకు ఎన్నటికీ తీరని లోటుగా మిగిలిపోతుంది.