iDreamPost
android-app
ios-app

15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి..

  • Published Jul 08, 2024 | 9:09 PM Updated Updated Jul 08, 2024 | 9:09 PM

Twice Oath Ceremony: ఎవరైనా ఒకసారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా, మంత్రిగా గెలిచినా ఒకసారి మాత్రమే ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. కానీ ఈయన మాత్రం రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు.

Twice Oath Ceremony: ఎవరైనా ఒకసారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా, మంత్రిగా గెలిచినా ఒకసారి మాత్రమే ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. కానీ ఈయన మాత్రం రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు.

15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి..

ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారంలో అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొంటారు. అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సేవ చేయాలన్న అంశానికి కట్టుబడి ఉంటామని చెప్పడానికి ఈ ప్రమాణం చేస్తారు. అయితే ఎవరైనా ఒక్కసారే ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా ఒకసారి, మంత్రిగా ఒకసారి చేశారేమో అని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా అందరూ ఒక్కసారే ప్రమాణ స్వీకారం చేస్తే ఈయన మాత్రం రెండు సార్లు చేశారు. ఈయనకే ఎందుకంత ప్రత్యేక వెసులుబాటు అని అనుకోకండి. ఆయన అలా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం ఏంటంటే?    

ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ నివాస్ రావత్ కు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆయన రెండు సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్ నివాస్ రావత్.. షియోపుర్ జిల్లాలోని విజయ్ పుర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రివర్గంలో రామ్ నివాస్ రావత్ కి చోటు కల్పిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. గవర్నర్ మంగుభాయ్ సీ పటేల్.. రావత్ తో మంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే ఆ సమయంలో రావత్ రాజ్య మంత్రి అని చెప్పబోయి రాజ్య కే మంత్రి అని చదివారు. రాజ్య మంత్రి అంటే రాష్ట్ర మంత్రి అని.. రాజ్య కే మంత్రి అంటే సహాయ మంత్రి అని అర్థం. అయితే ఆయన రాజ్య కే మంత్రి అని చదవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రమాణాన్ని రద్దు చేశారు. 15 నిమిషాల తర్వాత మంత్రిగా రావత్ తో ప్రమాణం చేయించారు. ఆ విధంగా రామ్ నివాస్ రావత్ 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.