iDreamPost
android-app
ios-app

శ్రీవల్లి పుష్పరాజ్ పాలిట విలన్ గా మారుతుందా !

  • Published Jul 11, 2025 | 3:35 PM Updated Updated Jul 11, 2025 | 3:35 PM

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎలాంటి ఫేమ్ , నేమ్ వచ్చాయో.. రష్మికకు కూడా ఇంచుమించు అలాంటి ఫేమ్ ఏ దక్కింది. పుష్ప 2 తర్వాత రష్మిక ఖాతాలో మంచి క్యారెక్టర్స్ పడడంతో.. ప్రస్తుతం ఈ అమ్ముడు సక్సెస్ బాటలో కొనసాగుతుంది. ఇప్పుడు రష్మిక విలన్ పాత్రలో కనిపించబోతుందట. అది కూడా పుష్పరాజ్ సినిమాలో..

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎలాంటి ఫేమ్ , నేమ్ వచ్చాయో.. రష్మికకు కూడా ఇంచుమించు అలాంటి ఫేమ్ ఏ దక్కింది. పుష్ప 2 తర్వాత రష్మిక ఖాతాలో మంచి క్యారెక్టర్స్ పడడంతో.. ప్రస్తుతం ఈ అమ్ముడు సక్సెస్ బాటలో కొనసాగుతుంది. ఇప్పుడు రష్మిక విలన్ పాత్రలో కనిపించబోతుందట. అది కూడా పుష్పరాజ్ సినిమాలో..

  • Published Jul 11, 2025 | 3:35 PMUpdated Jul 11, 2025 | 3:35 PM
శ్రీవల్లి పుష్పరాజ్ పాలిట విలన్ గా మారుతుందా !

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎలాంటి ఫేమ్ , నేమ్ వచ్చాయో.. రష్మికకు కూడా ఇంచుమించు అలాంటి ఫేమ్ ఏ దక్కింది. పుష్ప 2 తర్వాత రష్మిక ఖాతాలో మంచి క్యారెక్టర్స్ పడడంతో.. ప్రస్తుతం ఈ అమ్ముడు సక్సెస్ బాటలో కొనసాగుతుంది. రీసెంట్ గా తన కొత్త సినిమా మైసాను సైతం అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో రష్మిక సోలో ఎంట్రీ ఇస్తుంది. పైగా ఇప్పటివరకు రష్మిక చేసిన అన్ని రోల్స్ కంటే కూడా ఈ రోల్ చాలా డిఫ్ఫరెంట్ గా కనిపిస్తుంది. సరే ఇదంతా రష్మిక సినిమా వచ్చినప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రష్మిక విలన్ పాత్రలో కనిపించబోతుందట. అది కూడా పుష్పరాజ్ సినిమాలో..

ప్రస్తుతం బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఓ ఫాంటసీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అడపా దడపా ఈ సినిమాకు సంబందించిన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రష్మిక కూడా ఈ మూవీలో భాగం కానున్నట్లు లీకులు వచ్చాయి. అది కూడా ముఖ్యమైన లేడి విలన్ రోల్ లో రష్మిక కనిపించబోతుందట.ఆల్రెడీ ఈ సినిమాలో దీపికా పడుకుని , మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ , భాగ్య శ్రీ బోర్స్సే లాంటి హీరోయిన్స్ నటించబోతున్నారనే వార్తా.. ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఇక ఇప్పుడు ఈ కలర్ ఫుల్ క్యాస్టింగ్ లో రష్మిక కూడా యాడ్ అవ్వడం విశేషం. సో ఈసారి శ్రీవల్లి పుష్పరాజ్ పాలిట పవర్ ఫుల్ విలన్ గా మారబోతుందని తెలుస్తుంది.

పైగా ఇది రొటీన్ గా హీరో చేతిలో చనిపోయే విలన్ పాత్ర కాదంట. పూర్తిగా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేలా అట్లీ ఆమె పాత్రను డిసైన్ చేసినట్లు తెలుస్తుంది. రొటీన్ డ్యూయెట్ లు , లవ్ సీన్స్ , కామిడి సీన్స్ లాంటివి కాకుండా వీటి అన్నిటిని మించి భారీ రేంజ్ లో అట్లీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సో సడెన్ గా రష్మిక విలన్ రోల్ అంటే ఎలా ఉంటుందా ఏంటా అని పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. హీరోలు , విలన్ లు లేరు ఈ నాటకరంగంలో అని ఓ సినిమాలో అన్నట్లు.. తన పాత్రకు ఫుల్ స్కోప్ ఉండడంతో రష్మిక ఈ విలన్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఈ సినిమా నుంచి లీకుల రూపంలో అప్డేట్స్ బయటకు రావడమే కానీ… అఫీషియల్ అప్డేట్స్ ఏమి రాలేదు. ముందు ముందు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.