iDreamPost
android-app
ios-app

బన్నీ ఒకేసారి నాలుగు రూపాలలో దర్శనం ఇస్తే !

  • Published Jul 12, 2025 | 4:03 PM Updated Updated Jul 12, 2025 | 4:03 PM

ఈ మధ్య కాలంలో ఇలా డ్యూయల్ రోల్ గెటప్స్ ఎక్కువ అయిపోయాయి. వీటి అన్నిటికి ఏకంగా ఒకేసారి నాలుగు రూపాలలో హీరో కనిపిస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఆ ఊహే ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నిజమైతే తెరమీద చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో. అసలు ఇదంతా దేని గురించంటే. ప్రస్తుతం అట్లీ బన్నీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో ఇలా డ్యూయల్ రోల్ గెటప్స్ ఎక్కువ అయిపోయాయి. వీటి అన్నిటికి ఏకంగా ఒకేసారి నాలుగు రూపాలలో హీరో కనిపిస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఆ ఊహే ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నిజమైతే తెరమీద చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో. అసలు ఇదంతా దేని గురించంటే. ప్రస్తుతం అట్లీ బన్నీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  • Published Jul 12, 2025 | 4:03 PMUpdated Jul 12, 2025 | 4:03 PM
బన్నీ ఒకేసారి నాలుగు రూపాలలో దర్శనం ఇస్తే !

AI అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధ్యపడనిది ఏమి ఉండదు. కానీ ఎంత AI అయినా సరే మనిషిని ఎమోషన్స్ ను రీప్లేస్ చేయలేదు. సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేయాలంటే ఎంతోకొంత కచ్చితంగా హీరో కష్టపడాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో ఇలా డ్యూయల్ రోల్ గెటప్స్ ఎక్కువ అయిపోయాయి. వీటి అన్నిటికి ఏకంగా ఒకేసారి నాలుగు రూపాలలో హీరో కనిపిస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఆ ఊహే ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నిజమైతే తెరమీద చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో. అసలు ఇదంతా దేని గురించంటే. ప్రస్తుతం అట్లీ బన్నీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ కంటే కూడా లీకులే ఎక్కువైపోయాయి. మొన్నీమధ్యనే రష్మిక ఈ మూవీలో విలన్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు బన్నీ ఈ సినిమాలో ఏకంగా నాలుగు పాత్రలలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది నిజంగా ప్రేక్షకులకు షాక్ ఇచ్చే మ్యాటర్. దీని వెనుక చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. ఈ సినిమాలో హీరో ఫ్యామిలీకి సంబంధించి నాలుగు క్యారెక్టర్స్ ఉంటాయట. తాత , తండ్రి , ఇద్దరు కొడుకులు. ఈ నాలుగు క్యారెక్టర్స్ ను ముందు వేరే వేరే ఆర్టిస్ట్స్ తో చేద్దామని అనుకున్నారట. కానీ దానికంటే ముందు బన్నీ మీద అన్ని గెటప్స్ ట్రై చేశారట.

ఆ లుక్ టెస్ట్ లో బన్నీ సరిగ్గా ఆ పాత్రలకు సెట్ అయ్యేలా కనిపించాడట. దీనితో ఆ నాలుగు క్యారెక్టర్స్ చేయడానికి బన్నీ కూడా ఓకే చెప్పాడట. దీనితో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. ఒకవేళ వర్క్ అవుట్ అయితే మాత్రం స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఒకే సినిమాలో ఇన్ని పాత్రలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అయితే పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ బాగానే రిస్క్ లు చేస్తున్నడనిపిస్తుంది. పైగా అటు గ్లామర్ కోటింగ్ లో ఎక్కడా తగ్గడం లేదు అట్లీ. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి లీకులు , అఫీషియల్ అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.