iDreamPost
android-app
ios-app

భార్యకు దగ్గరుండి మరీ 3 పెళ్లిళ్లు చేయించిన భర్త! ఒకరి తరువాత ఒకరితో!

  • Published Jul 27, 2024 | 2:20 PM Updated Updated Jul 27, 2024 | 2:20 PM

MP-Looteri Dulhan Gang Busted: భార్యకు దగ్గరుండి మరీ మూడు పెళ్లిళ్లు చేయించాడో వ్యక్తి. ఎందుకంటే..

MP-Looteri Dulhan Gang Busted: భార్యకు దగ్గరుండి మరీ మూడు పెళ్లిళ్లు చేయించాడో వ్యక్తి. ఎందుకంటే..

  • Published Jul 27, 2024 | 2:20 PMUpdated Jul 27, 2024 | 2:20 PM
భార్యకు దగ్గరుండి మరీ 3 పెళ్లిళ్లు చేయించిన భర్త! ఒకరి తరువాత ఒకరితో!

సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ కేటుగాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏమాత్రం కష్టపడకుండా.. ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునేవాళ్లు పెరిగిపోతున్నారు. వావి వరసలు మరిచిపోయి.. నీచాలకు దిగ జారుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎంతకైనా తెగబడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతదేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా చూస్తారు. అయితే రాను రాను ఆ బంధం అపవిత్రం అవుతోంది. ఆర్థిక, శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమ, పెళ్లి బంధాలను ఉపయోగించుకుంటున్నారు కొందరు. తాజాగా ఓ వ్యక్తి.. డబ్బు సంపాదన కోసం భార్యను ఎరగా వేసి.. పెళ్లి బంధాన్ని వినియోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతకు తెగించాడంటే.. తానే దగ్గరుండి భార్యకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేయించాడు. మరోసారి ఈ తరహా మోసానికి పాల్పడబోతుండగా.. పట్టుబడ్డాడు. ఆ వివరాలు..

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యకు దగ్గరుండి మరీ మూడు పెళ్లిళ్లు చేయించాడో వ్యక్తి. వీరి పాపం పండి.. తాజాగా పోలీసులకు చిక్కారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖర్గోన్‌ జిల్లాకు చెందని నిఖిల్‌ సావ్లేకి దీపికా అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే వారికి లగ్జరీగా బతకాలని కోరిక. అందుకు బాగా డబ్బుల సంపాదించాలి. దీని కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ మార్గం ఎంచుకున్నారు. అదేంటంటే.. వయసు పైబడి.. పెళ్లి కాకుండా ఉన్న యువకులను టార్గెట్‌ చేశారు. అలాంటి వారికి తన భార్యను ఇచ్చి వివాహం చేసేవాడు సాల్వే. పెళ్లి కాని యువకులు వివరాలు కనుక్కుని.. వారి వద్దకు వెళ్లేవాడు. భార్యను తన సోదరిగా పరిచయం చేసేవాడు. ఆ తర్వాత వారితో పెళ్లి సంబంధం సెట్‌ చేసుకునేవారు. వివాహం అయిన కొన్ని రోజుల్లోనే దీపిక.. అత్తవారింటి నుంచి నగదు, నగలు తీసుకుని సాల్వే దగ్గరకు వచ్చేది. ఆతర్వాత వారు అక్కడ నుంచి పరారయ్యేవారు.

ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేయించి.. భారీగా నగదు, నగలు దోచుకున్నారు ఈ దంపతులు. మరి వీరు చేస్తోన్న మోసం ఎలా బయటపడింది అంటే.. దీపిక ఇలా ఊర్లు మారుతూ ఉండే క్రమంలో తల్లికి చాలా రోజులుగా కాల్‌ చేయలేదు. దాంతో ఆమె సాల్వే ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. దీపిక అత్తింటి వారు తమకు తెలియదు అని చెప్పారు. కుమార్తె గురించి ఆందోళనతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి డొంక లాగగా.. వీరి వ్యవహరం బట్టబయలు అయ్యింది. డబ్బు కోసం భార్యను చెల్లిగా పరిచయం చేయడమే కాక.. ఆమెకు మూడు పెళ్లిళ్లు చేయించిన సాల్వే తీరును తూర్పారబడుతున్నారు అతడి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు. దీని కన్నా అడుక్కు తినడం మేలు అంటున్నారు.