iDreamPost
android-app
ios-app

వార్ 2 ని హైలెట్ చేసేది ఎవరు ?

  • Published Jul 11, 2025 | 12:20 PM Updated Updated Jul 11, 2025 | 12:20 PM

సరిగ్గా నెల రోజుల్లో వార్ 2 మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పోటీగా రజినీకాంత్ కూలి మూవీ వస్తుంది. రెండు దేనికవే సెపరేట్ ఫ్యాన్ బేస్ , సెపరేట్ జోనర్ సినిమాలే. అయినా ఎక్కడో వార్ 2 కు మాత్రం కాస్త ప్రయోరిటి తగ్గిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ కానగరాజ్ కూలి ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నా

సరిగ్గా నెల రోజుల్లో వార్ 2 మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పోటీగా రజినీకాంత్ కూలి మూవీ వస్తుంది. రెండు దేనికవే సెపరేట్ ఫ్యాన్ బేస్ , సెపరేట్ జోనర్ సినిమాలే. అయినా ఎక్కడో వార్ 2 కు మాత్రం కాస్త ప్రయోరిటి తగ్గిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ కానగరాజ్ కూలి ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నా

  • Published Jul 11, 2025 | 12:20 PMUpdated Jul 11, 2025 | 12:20 PM
వార్ 2 ని హైలెట్ చేసేది ఎవరు ?

సరిగ్గా నెల రోజుల్లో వార్ 2 మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పోటీగా రజినీకాంత్ కూలి మూవీ వస్తుంది. రెండు దేనికవే సెపరేట్ ఫ్యాన్ బేస్ , సెపరేట్ జోనర్ సినిమాలే. అయినా ఎక్కడో వార్ 2 కు మాత్రం కాస్త ప్రయోరిటి తగ్గిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ కానగరాజ్ కూలి ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. పైగా ఈసారి సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున , ఉపేంద్ర లాంటి మల్టి స్టార్స్ ను పెట్టాడు. ఇక ఈ మధ్య వినిపిస్తున్న టాక్ అయితే ఎలాంటి ట్రైలర్ కట్ లేకుండానే సినిమాను డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ చేస్తారు అని. కానీ ఇది ఎంత వరకు నిజమో తెలీదు.

ఇకపోతే వార్ 2 విషయానికొస్తే.. తారక్ స్ట్రెయిట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మొదటి మూవీ ఇది. సో తారక్ ఫ్యాన్స్ నుంచి గట్టిగా హైప్ ఉంది. కానీ ఇది సరిపోదు.వార్ 2 టీజర్ నైతే రిలీజ్ చేశారు.. అయితే దానివలన పెద్దగా సినిమాకు ఒరిగిందేమీ లేదు. పైగా దాని నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఏ ఎక్కువ. సో వార్ 2 మేకర్స్ ఇంకాస్త జాగ్రత్త వహించాల్సిందే. ఇప్పటినుంచే సినిమాను ఎదో ఒక అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులలో ఇంజెక్ట్ చేయాల్సిందే. బీ టౌన్ లో ఈ సినిమాకు ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే హృతిక్ రోషన్ కు అక్కడ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్ఆర్ఆర్ దేవర లాంటి సినిమాల తర్వాత తారక్ కూడా అక్కడ ఫ్యాన్స్ బేస్ ను పెంచుకున్నాడు. సో ఆటోమాటిక్ గా అక్కడ థియేటర్స్ ఫుల్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు.. థియేటర్స్ లో లాంగ్ రన్ మైంటైన్ చేయాలంటే ప్రమోషన్స్ ఏ కీలకం.

ఎంత తారక్ అభిమానులు తారక్ కోసం సినిమా చూసినా సరే.. నార్మల్ ఆడియన్స్ కూడా దీనికి యాడ్ అయితేనే బాక్స్ ఆఫీస్ కు లాభం ఉంటుంది. వార్ 2 తెలుగు హక్కులను నాగవంశీ తీసుకున్నాడు. అప్పటినుంచైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయేమో అని అంతా ఎదురుచూశారు. కానీ వాతావరణం సైలెంట్ గానే ఉంది. అటు చూస్తే లోకేష్ కనగరాజ్ సైలెంట్ గానే ఒక్కో అప్డేట్ ఇచ్చేస్తున్నాడు. ట్రైలర్ లేకపోయినా సరే సినిమా సూపర్ హిట్ అవుతుందని అంటున్నాడు .

ఈ పోటీ తట్టుకోవాలంటే నాగవంశీ వీలైనంత త్వరగా నడుం బిగించాల్సిందే. అప్పుడు కానీ లాంగ్ రన్ లో టికెట్స్ తెగవు. సో అలా జరగాలంటే ప్రమోషన్స్ బాధ్యత అంతా హృతిక్ , తారక్ మీదే ఉంది. తెలుగులో ఓ భారీ ప్రమోషనల్ ఈవెంట్ నైతే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇక్కడ తారక్ ఫేస్ ను ఎంత వరకు వాడుకుంటారు. ఈవెంట్ ఎక్కడ చేస్తారు. వార్ 2 నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. అనే దానిమీదే ఈ మూవీ బజ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక నుంచి వార్ 2 ని ఏ విధంగా హైలెట్ చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.