iDreamPost
android-app
ios-app

అందంతో ఎస్సైకి వల వేసిన మహిళా కానిస్టేబుల్.. చివరికి ఏమైందంటే?

  • Published Sep 12, 2024 | 2:56 PM Updated Updated Sep 12, 2024 | 5:39 PM

ప్రేమించిన పాపానికి ఓ ఎస్ఐ , మహిళా కానిస్టేబుల్ చేతిలో దారుణంగా మోస పోయాడు. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ చాలా పెద్ద స్కేచ్ తోనే పాపం ఆ ఎస్ఐ పై కుట్ర పన్నింది. చివరికి జరగరాని ఘోరం జరిగిపోయింది.

ప్రేమించిన పాపానికి ఓ ఎస్ఐ , మహిళా కానిస్టేబుల్ చేతిలో దారుణంగా మోస పోయాడు. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ చాలా పెద్ద స్కేచ్ తోనే పాపం ఆ ఎస్ఐ పై కుట్ర పన్నింది. చివరికి జరగరాని ఘోరం జరిగిపోయింది.

  • Published Sep 12, 2024 | 2:56 PMUpdated Sep 12, 2024 | 5:39 PM
అందంతో ఎస్సైకి వల వేసిన మహిళా కానిస్టేబుల్.. చివరికి ఏమైందంటే?

నిజాయితీగా ఓ వ్యక్తిని ప్రేమించకపోయినా పర్వలేదు కానీ, ప్రేమించి మోసం చేయడం చాలా తప్పు. కానీ, ప్రస్తుత కాలంలో మోసం చేయడం మాట పక్కన పెడితే.. ప్రేమ పేరుతో ప్రాణాలు తీసే స్టేజ్ కి చాలామంది దిగజారారు.  కలిసి తిరిగినంత వరకు బాగానే ఉన్నా ప్రేమ.. ఆ తర్వాత హత్య చేసేంతా కృూరత్వంగా ఎందుకు మారిపోతుందో అర్ధం కావడం లేదు. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఇలానే ప్రేమించి వ్యక్తిని  తడి గుడ్డతో గొంతు కోసేంత ఈజీగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్  తన మాజీ ప్రియుడితో కలిసి  ఎస్‌ఐని కారుతో ఢికొట్టి చంపేసింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళా కానిస్టేబుల్ తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రాజ్‌గఢ్ జిల్లాలోని  పల్లవి సోలంకి అనే మహిళా కానిస్టేబుల్, కరణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇక కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, విడిపోయారు. అయితే కరణ్ తో విడిపోయిన పల్లవి అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు క్లోజ్ గా మాట్లాడుకునేవారు.  ఇక వీరిద్దరి వ్యవహారం పై మాజీ ప్రియుడుకు అనుమానం రావడంతో.. పల్లవిని ఈ విషయం పై నిలదీశాడు. దీంతో పరస్పరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మళ్లీ మాజీ ప్రియుడితో కలిసిపోయిన పల్లవి దారుణమైన ఆలోచన చేసింది.

ఎక్కడ వీరిద్దరి ప్రేమకు ఎస్ఐ దీపాంకర్ అడ్డుగ వస్తాడమోనని తన ప్రియుడితో కలిసి అతనిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇక పథకం ప్రకారం.. మంగళవారం ఎస్‌ఐ దీపాంకర్‌ గౌతమ్‌ తన ఇంట్లో ఉండగా, పల్లవి ఫోన్ చేసి భోపాల్ బైపాస్ వైప్ రావాలని చెప్పింది. దీంతో బియోరా-దేవాస్ హైవేపై దేహత్ పోలీస్ స్టేషన్ వైపు బైక్‌పై వెళ్తున్న క్రమంలో.. కరణ్, పల్లవి కారుతో ఢీకొట్టారు. అయితే అప్పటికే దీపాంకర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. తమ కారుతో  30 మీటర్ల మేర ఆయనను ఈడ్చుకెళ్లారు. దీంతో దీపాంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయనను అంబులెన్స్‌లో సివిల్‌ ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఎస్ఐ దీపాంకర్ గౌతమ్  మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ ని ఢీకొట్టిన కారు నంబర్ ను గుర్తించిగా, ఈ పని చేసింది పల్లవి, ఆమె ప్రియుడు కరణ్ అని తేలింది.

దీంతో నిందితులిద్దరూ తామే హత్య చేశామని అంగకరించినట్లు దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గోవింద్ మీనా తెలిపారు. అయితే తమ ప్రేమకు అడ్డుగా  ఎస్ఐ వస్తున్నాడని, అందుకే ఆయనను హత్య చేయాలని అనుకున్నాం అని పేర్కొన్నారు. అనంతరం మహిళా కానిస్టేబుల్, ఆమె ప్రియుడిపై సెక్షన్ 103 (1), 3 (5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. మరీ,  మాజీ ప్రేమకు అడ్డుగా  ఉన్నాడని ఎస్ఐని నమ్మించి హత్య చేసిన ఈ లేడీ కానిస్టేబుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.