Swetha
అసలు ప్రెసెంట్ షూటింగ్ లో ఉన్న అన్ని సినిమాలలో ఈ మెగా 157 సినిమానే జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. త్వరలో చిరు బర్త్ డే ఉంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమా నుంచి ఎదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంటుంది. ఆ అప్డేట్ టైటిల్ రివీల్ అయ్యి ఉండొచ్చని ఒక టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు ప్రెసెంట్ షూటింగ్ లో ఉన్న అన్ని సినిమాలలో ఈ మెగా 157 సినిమానే జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. త్వరలో చిరు బర్త్ డే ఉంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమా నుంచి ఎదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంటుంది. ఆ అప్డేట్ టైటిల్ రివీల్ అయ్యి ఉండొచ్చని ఒక టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Swetha
అనిల్ రావిపూడి నా మజాకానా.. ఇలా సినిమా అనౌన్స్ చేయడం వెంటనే మొదటి షెడ్యూల్ రెండో షెడ్యూల్ అని.. వరుస అప్డేట్స్ ఇవ్వడం. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేయడం. అన్ని టక టక కానిచ్చేస్తున్నాడు. అసలు ప్రెసెంట్ షూటింగ్ లో ఉన్న అన్ని సినిమాలలో ఈ మెగా 157 సినిమానే జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. త్వరలో చిరు బర్త్ డే ఉంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమా నుంచి ఎదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంటుంది. ఆ అప్డేట్ టైటిల్ రివీల్ అయ్యి ఉండొచ్చని ఒక టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హఠాత్తుగా ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ లేకుండా మెగా 157 టైటిల్ లీక్ అయింది. చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పేరు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అని ప్రచారంలోకి వచ్చేసింది. చిరు పుట్టిన రోజు నాడు రివీల్ చేయాల్సిన టైటిల్ ఇంత త్వరగా లీక్ అవ్వడంతో.. ప్రేక్షకులు షాక్ అయ్యారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ టైటిల్ ను బయటకు వదిలినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి జిమ్మిక్కులు చేయడంలో అనిల్ రావిపూడి చేయి తిరిగిన వాడు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. ముందు నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఫైనల్ గా ఆడియన్స్ చేతే ఇదే సరైన టైటిల్ అనిపించేల కంటెంట్ ఇచ్చాడు.
సో ఈసారి మన శంకర వర ప్రసాద్ గారు కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అనే ఆలోచనతోనే ముందే లీక్ చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి ఈ టైటిల్ మీద ఆడియన్స్ లో మిక్స్డ్ ఒపీనియన్ నెలకొంది. మరి స్టోరీ కి టైటిల్ కు సంబంధం ఉందా లేదా అనేది దర్శకుడికే తెలియాలి. టైటిల్ మీద ఏమైనా పూర్తి నెగిటివి వస్తే.. అఫీషియల్ అప్డేట్ టైం కు మార్చేస్తారేమో చూడాలి మరి. అయితే దీనికంటే ముందు రఫ్ఫాడిద్దాం అనే టైటిల్ కూడా వినిపించింది. ఇప్పుడేమో శంకర వరప్రసాద్ గారు అంటే చిరు పేరునే టైటిల్ గా లీక్ అయింది. అసలు మ్యాటర్ తేలడానికి కాస్త టైం పట్టెలానే ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.