Swetha
ఒకప్పటి రోజులు కావివి. ప్రతి దానిలోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా విషయంలో అయితే మరీ పర్టిక్యులర్ గా ఉంటున్నారు. ఎదో పెద్ద హీరో , పెద్ద డైరెక్టర్ సినిమా అయితే తప్ప థియేటర్స్ వరకు కదలడం లేదు. ఓ వేళ మౌత్ టాక్ కనుక బావుంటే.. కొద్దో గొప్పో థియేటర్స్ వరకు వస్తున్నారు.
ఒకప్పటి రోజులు కావివి. ప్రతి దానిలోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా విషయంలో అయితే మరీ పర్టిక్యులర్ గా ఉంటున్నారు. ఎదో పెద్ద హీరో , పెద్ద డైరెక్టర్ సినిమా అయితే తప్ప థియేటర్స్ వరకు కదలడం లేదు. ఓ వేళ మౌత్ టాక్ కనుక బావుంటే.. కొద్దో గొప్పో థియేటర్స్ వరకు వస్తున్నారు.
Swetha
ఒకప్పటి రోజులు కావివి. ప్రతి దానిలోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా విషయంలో అయితే మరీ పర్టిక్యులర్ గా ఉంటున్నారు. ఎదో పెద్ద హీరో , పెద్ద డైరెక్టర్ సినిమా అయితే తప్ప థియేటర్స్ వరకు కదలడం లేదు. ఓ వేళ మౌత్ టాక్ కనుక బావుంటే.. కొద్దో గొప్పో థియేటర్స్ వరకు వస్తున్నారు. సో ఈ లెక్కన చిన్న హీరోలు జాగ్రత్త పడకు తప్పదు. వారు సినిమా తీయాలి అంటే కచ్చితంగా కథలో కొత్తదనం ఉండాల్సిందే. లేదంటే ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు. ఇప్పుడు ఓ భామ అయ్యో రామ విషయంలో కూడా ఇదే జరిగింది.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ.. ఛాయ్ బిస్కెట్ లో వీడియోలు రీల్స్ చేసుకుంటూ.. వెండితెరపైకి వచ్చిన హీరో సుహాస్. కలర్ ఫోటో సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇక అప్పటినుంచి సుహాస్ తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుని సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ప్లాప్పులు పడినా కూడా వాటిని పట్టించుకోకుండా వరుస సినిమాలు తీస్తూనే ఉన్నాడు. మొదట్లో అతను చేసే క్యారెక్టర్స్ బాగానే ఉండేవి. కానీ రాను రాను క్వాలిటీ తగ్గిపోయి ప్రేక్షకులను బోర్ కొట్టించేస్తున్నాయి. సుహాస్ చేసిన గత నాలుగు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయాయి.
రీసెంట్ గా వచ్చిన ఓ భామ అయ్యో రామ అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇంత వీక్ కంటెంట్ సుహాస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనే సందేహాలు మొదలయ్యాయి. గత మూడేళ్ళుగా ఇదే పరిస్థితి సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. కానీ ఇది మంచి సినిమా అనే పేరు మాత్రం ఎక్కడ వినిపించడం లేదు. సినిమాల సంఖ్య పెంచుతున్నా కూడా.. అది చూసేందుకు థియేటర్స్ లో జనం లేకపోలేదు ఎలాంటి ప్రయోజనం లేదు. సో సుహాస్ అలా వచ్చిన సినిమా అల్లా చేసుకుంటూ పోకుండా.. ఇకపై జాగ్రత్త పడాల్సిందే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.