iDreamPost
android-app
ios-app

మంచి బిడ్డ కోసం మరిదితో వదిన జంప్.. భర్తకు చెప్పి మరీ..!

  • Published Oct 03, 2024 | 6:27 PM Updated Updated Oct 03, 2024 | 6:27 PM

నానాటికి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు వివాహ బంధాన్ని బీటలు వారుస్తున్నాయి. తాజాగా ఓమహా ఇల్లాలు ఏకంగా మరిదితోనే జంప్ అయ్యింది. ఈ ఘటన..

నానాటికి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు వివాహ బంధాన్ని బీటలు వారుస్తున్నాయి. తాజాగా ఓమహా ఇల్లాలు ఏకంగా మరిదితోనే జంప్ అయ్యింది. ఈ ఘటన..

  • Published Oct 03, 2024 | 6:27 PMUpdated Oct 03, 2024 | 6:27 PM
మంచి బిడ్డ కోసం మరిదితో వదిన జంప్.. భర్తకు చెప్పి మరీ..!

మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి.. నైతిక విలువలు దిగజారుతున్నాయి. వివాహ వ్యవస్థ పూర్తిగా బలహీన పడుతుంది. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. అందుకు కారణం వివాహేతర, అక్రమ సంబంధాలు. జీవిత భాగస్వామిని మోసం చేస్తూ పరాయి వ్యక్తులతో పడక సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అడ్డువచ్చిన భర్తను లేదా భార్యను కడతేరుస్తున్నారు. లేదంటే.. నచ్చిన వ్యక్తితో పారిపోయి ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన కూడా అలాంటిదే. భర్త తమ్ముడితో అంటే మరిదితో జంప్ అయ్యిందో మహా ఇల్లాలు. పారిపోయే ముందు నీ కంటే మీ తమ్ముడు అందంగా ఉన్నాడు.. అతడితో వెళ్లిపోతున్నానంటూ భర్తకు చెప్పి.. వెళ్లిపోవడం ట్విస్ట్. పరారయ్యాక.. తమ విషయంలో జోక్యం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతేకాదు.. మాకు ఏదైనా ప్రమాదం జరిగే బాధ్యత మీరే వహించాలంటూ కుటుంబ సభ్యులకు వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇంతకు మరిదితో పారిపోవడానికి కారణం తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. మంచి బిడ్డను కనేందుకు ఆమె మరిదితో వెళ్లిపోయిందట ఇల్లాలు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్ పూర్‌లో చోటుచేసుకుంది. భార్య చేసిన పనికి ఖంగుతిన్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఈ దంపతులకు పెళ్లై 10 ఏళ్లు అవుతుంది. పిల్లలు కలగలేదు. అయితే అందంగా లేవంటూ భర్తను దగ్గరకు రానిచ్చేది కాదు భార్య.  భర్త కన్నా మరిది అందంగా కనిపించడంతో అతడి మాయలో పడింది. వదినతో మంచిగా మాట్లాడేవాడు మరిది.  అప్పటి నుండి భర్తను శారీరకంగా దూరం పెడుతూ మానసికంగా హింసించేది. మీ తమ్ముడితోనే ఉంటా. అతడితో అందమైన పిల్లలు కంటా అని చెప్పేది. అతడితో వెళ్లిపోతున్నానంటూ మరిదితో ఎస్కేప్ అయ్యింది.

పోయిందేదో పోకుండా.. మీరు మా జోలికి వస్తే చస్తాం, మేము చస్తే మీదే బాధ్యత అంటూ బెదిరిస్తుంది. దీంతో భయపడ్డ భర్త, బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఎవరితో పోయినా మాకు పర్వాలేదు కానీ ఆమె తప్పు చేసి మమ్మల్ని బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు భర్త. భార్య నుండి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆమె బెదిరింపు సందేశాలు పంపకుండా చర్యలు తీసకోవాలంటూ వేడుకున్నాడు. కాగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. తదుపరి విచారణ చేపడుడుతన్నామని, పారిపోయిన ప్రేమికుల కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. మంచి బిడ్డ కోసం మరిదితో మహిళ పరారైన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet