జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల కుటుంబానిది కండబలమైతే తాతిరెడ్డి కుటుంబానిది రాజకీయ, ఆర్థిక అండ. జమ్మలమడుగు నియోజకవర్గంలో 1951 నుంచీ తాతిరెడ్డి కుటుంబీకులు ఎమ్మెల్యే పదవికీ పోటీ చేస్తూ వస్తున్నారు. రెండు సార్లు తాతిరెడ్డి పుల్లా రెడ్డి ఓడిపోగా, తాతిరెడ్డి నరసింహారెడ్డి (టీఎన్ఆర్) రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భాం నుంచి శివారెడ్డి (బాంబుల శివారెడ్డి) హవా మొదలైంది. వారి ప్రత్యర్థులుగా అనేక మంది కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా 2004 వరకూ ఎవరూ గెలవలేకపోయారు. 1985 […]
చినబాబూ మీరు ఎక్కడున్నా తక్షణమే ఇంటికి రావాలి..మీరు మాకు కనిపించక చాలా రోజులు అవుతోంది..ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా నిన్ను ఎవరూ ఏమీ అనరు… నీ మీద బెంగెట్టు కున్నాం..గమ్మున ఇంటికి రావాలని మా కోరిక .. ఇదీ ఓ హార్డ్ కోర్ టిడిపి కార్యకర్తలు ఇలా కోరుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చినబాబు లోకేష్ హవా అంతా ఇంతా కాదు.. ఆయన జోక్యం లేని నియోజకవర్గం గాని, డిపార్ట్మెంట్ గానీ లేదన్నది జగద్విదితం. కర్నూల్ ఉప […]
వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు వెళ్లబోయే పెద్దలు ఎవర్నది నేడు తేలే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీతో నామినేషన్ దాఖలు గడువు ముగుస్తోంది. ఈ నెల 26వ తేదీన జరగబోయే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురుకి అవకాశం ఉంది. ఆ నలుగురు వైఎస్సార్సీపీ తరఫునే రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. తనను నమ్ముకున్న వారికి పెద్దపీట వేస్తారని పేరున్న జగన్.. ఆ కోవలోనే […]
జగన్ మరో సంచలనానికి తెరలేపబోతున్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గం విషయంలో అనూహ్యంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి ఈసారి ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు విజయం సాధించి, బంపర్ మెజార్టీ సాధించిన తర్వాత తన క్యాబినెట్ సహచరుల ఎంపిక విషయంలో సీఎం తీరు ఆశ్చర్యకరంగా మారింది. అనేక మంది ఆశావాహులు, ముఖ్యంగా సీనియర్లను అసంతృప్తికి గురిచేసింది. అయినప్పటికీ ఆర్కే రోజా వంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా తమ అసంతృప్తిని […]
ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ తీర్మానించి వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించింది. మంచి సలహాలు ఇస్తుందని ఏర్పాటు చేసుకున్న మండలిని రాజకీయాలకు వాడుకుంటున్నారనే కారణంతో క్యాబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీకి పంపింది. అయితే ఏపీ మండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఎగువసభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్తు 1958 నుండి 1985 మరియు 2007 నుండి ఇప్పటివరకూ రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఏపీలో […]
ఏపీలో శాసనమండలి చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఇప్పటికే కీలక బిల్లుల విషయంలో కొర్రీలు వేసి చివరకు మండలి రద్దు వరకూ రావడానికి అక్కడి పరిణామాలు కారణం అయ్యాయి. అయితే రాష్ట్ర స్థాయిలో మండలికి సంబంధించిన ముగింపు ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్న వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుందోననే క్లారిటీ ఇంకా రాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత సందర్భంగా మండలి రద్దు తీర్మానం ఆమోదించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల మోడీ, […]
తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి శాసనమండలికి వచ్చిన రెండు బిల్లులలను సెలక్ట్ కమిటీ పరిశీలనకుకి పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, తన ఆదేశాలను శాసనమండలి కార్యదర్శి పాటించలేదని, సెలక్ట్ కమిటీ ఏర్పడినట్టు బులిటెన్ విడుదల చెయ్యమని ఇప్పటికి మూడుసార్లు మండలి కార్యదర్శి బాలకృష్ణాచార్యులను ఆదేశించినప్పటికీ, మండలి కార్యదర్శి తన ఆదేశాలను పాటించలేదని, ఈ వివాదంలో మీరు కలుగజేసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ గవర్నర్ తలుపులు తట్టారు. అధికార వికేంధ్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు […]
ఏపీలో బీజేపీ నేతలకు విషయం బోధపడుతున్నట్టు కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ పట్ల ఎలా స్పందించాలననది ఆపార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. బీజేపీ అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతున్న జగన్ పై విమర్శలు గుప్పించాలా లేక ఏపీ ప్రభుత్వ విధానాలను సమర్థించాలన్నది వారికి స్పష్టత రావడం లేదు. బీజేపీలో కొందరు నేతలు జగన్ నిర్ణయాలతో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటుండగా కొందరు నేతలు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు మాత్రం ఈ పరిస్థితి మింగుడుపపడం లేదు. […]
రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయడంపై ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే వారికి ఢిల్లీలో ముఖ్య నేతలెవరూ అపాయింట్మెంట్ […]
ఏపీ రాజకీయాల్లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు కావడంతో అనివార్యంగా పలువురు నేతలు బీజేపీ పంచన చేరాల్సి వచ్చింది. ముఖ్యంగా బీజేపీ తో నాలుగేళ్ల స్నేహం తర్వాత ఏడాది కాలం పాటు వివిధ రూపాల్లో విరుచుకుపడిన చంద్రబాబు సన్నిహితులు మళ్లీ కమలం గూటికే చేరాల్సి వచ్చింది. నలుగురు ఎంపీలు పార్టీని వీడినా కనీసం వారి మీద విమర్శలు చేసేందుకు గానీ, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయడానికి కూడా టీడీపీ అధిష్టానం సిద్ధపడలేదు. అదే సమయంలో […]