iDreamPost
android-app
ios-app

చినబాబూ !!ఎక్కడున్నా రావాలి !! నిన్ను ఎవరూ ఏమీ అనరు ..

చినబాబూ !!ఎక్కడున్నా రావాలి !!  నిన్ను ఎవరూ ఏమీ అనరు ..

చినబాబూ మీరు ఎక్కడున్నా తక్షణమే ఇంటికి రావాలి..మీరు మాకు కనిపించక చాలా రోజులు అవుతోంది..ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా నిన్ను ఎవరూ ఏమీ అనరు… నీ మీద బెంగెట్టు కున్నాం..గమ్మున ఇంటికి రావాలని మా కోరిక ..

ఇదీ ఓ హార్డ్ కోర్ టిడిపి కార్యకర్తలు ఇలా కోరుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చినబాబు లోకేష్ హవా అంతా ఇంతా కాదు.. ఆయన జోక్యం లేని నియోజకవర్గం గాని, డిపార్ట్మెంట్ గానీ లేదన్నది జగద్విదితం. కర్నూల్ ఉప ఎన్నికల సమయంలో అయితే ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి క్షణక్షణం మానిటర్ చేసిన లోకేష్ భారీ ప్రలోభాలు, అధికార అండదండలతో మొత్తానికి కర్నూలు గెలిచారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడం, ఆ తరువాత లోకేష్ కూడా ఓడిపోవడం, ఆ అవమానభారం మరువకముందే శాసనమండలి రద్దుకావడంతో లోకేష్ కు ఉన్న ఆ ఒక్క పదవీ పోయింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ఆయన ఉనికి ఎక్కడా కానరావడం లేదు. పెద్దగా బాధ్యత తీసుకుని యాక్టివ్ గా పని చేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు గానీ కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీతానై వ్యవహరించిన లోకేష్ ఇప్పుడు పూర్తిగా తెరమరుగైపోవడాన్ని ఆయన హార్డ్ కోర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటప్పుడే లోకేష్ యాక్టివ్ గా ఉండి, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని, ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉండాలి గానీ ఇలా ఉంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు దర్పం చూపడం,పవర్ ను ఎంజాయ్ చేయడమే తప్ప కష్టకాలంలో పార్టీకి పనికొస్తే బాగుణ్ణు కదాని అంటున్నారు..

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişcasibompokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet