Swetha
మలయాళ సినిమాలు ఓటిటి ని రూల్ చేసేస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అదేంటో తెలియదు కానీ ఈ సినిమాలు ఇట్టే ప్రేక్షకులను మెప్పించేస్తాయి. ఈ క్రమంలో మరో మలయాళ ఫాంటసి థ్రిల్లర్ ఓటిటి లోకి వచ్చేసింది.
మలయాళ సినిమాలు ఓటిటి ని రూల్ చేసేస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అదేంటో తెలియదు కానీ ఈ సినిమాలు ఇట్టే ప్రేక్షకులను మెప్పించేస్తాయి. ఈ క్రమంలో మరో మలయాళ ఫాంటసి థ్రిల్లర్ ఓటిటి లోకి వచ్చేసింది.
Swetha
మలయాళ సినిమాలు ఓటిటి ని రూల్ చేసేస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అదేంటో తెలియదు కానీ ఈ సినిమాలు ఇట్టే ప్రేక్షకులను మెప్పించేస్తాయి. ఈ క్రమంలో మరో మలయాళ ఫాంటసి థ్రిల్లర్ ఓటిటి లోకి వచ్చేసింది. పైగా ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డెబ్యూ డైరెక్టర్ స్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 9 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కామిడి పరంగా మూవీ ఓకే కానీ.. కథ పరంగా మెప్పించలేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి రానుంది.
ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. నలుగురు కాలేజీ అబ్బాయిలు ఉంటారు. వారికి కామిక్ పుస్తకాలంటే చాలా ఇష్టం. వారు అనుకోకుండా ఓసారి ఓ అడ్వెంచరస్ ట్రిప్ లో పాల్గొంటారు. అలాగే వారికి అదే కాలేజ్ లో ఓ ప్రొఫెసర్ తో స్నేహం ఏర్పడుతుంది. అతనికి కొన్ని అతీంద్రయ శక్తులు ఉంటాయి. అతని పరిచయం తర్వాత వీరి జీవితం ఎలా సాగింది ? ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు పడక్కలం. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా జూన్ 10 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మళయాళంతో పాటు తెలుగు , తమిళ్ , కన్నడ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. లాజిక్ లేకుండా కామిడి మూవీస్ ఇష్టపడే వారు ఈ మూవీ చూడొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.