iDreamPost
android-app
ios-app

అమిత్ షా తో ముగిసిన సియం జగన్ భేటి…

  • Published Feb 14, 2020 | 5:43 PM Updated Updated Feb 14, 2020 | 5:43 PM
అమిత్ షా తో ముగిసిన సియం జగన్ భేటి…

రెండు రోజుల క్రిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో సుమారు గంటన్నర పాటు సమావేశమై రాష్ట్రానికి సంభందించిన 10 అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి జగన్ , నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. 40 నిమషాల పాటు సాగిన ఈ సమవేశం లో రాష్ట్ర అభివృద్దికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరినట్టు తెలుస్తుంది. ప్రధానితో జరిగిన సమయంలో చర్చకు వచ్చిన 10 కీలక అంశాలనే జగన్ వినతిపత్రం రూపంలో హోం మంత్రి దృష్టికి కూడా తెచ్చినట్టు తెలుస్తుంది. పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, ప్రత్యకహొదా, రాజధాని వికేంద్రికరణ, మండలి రద్దు అంశాలపై ప్రత్యకంగా చర్చినట్టు తెలుస్తుంది.

మార్చ్ మూడు నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు సమావేశాల్లొనే శాశన మండలి రద్దు బిల్లుని తీసుకుని రావాలని ఈ మేరక్ లా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. అలాగే కర్నూల్ లో జ్యుడిషల్ క్యాపిటల్ ఏర్పాటు చెయటానికి అన్ని అనుమతులు ఇవ్వలని అమరావతిలో ఉన్న ప్రిన్సిపల్ బెంచ్ ను కర్నూల్ కి మార్చాల్సి ఉన్నందున రాష్ట్రపతి ఆమొదం కావాలని ఈ మేరకు లా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వలని కోరినట్టు తెలుస్తుంది.

మోత్తంగా రెండు రోజుల క్రితం ప్రధానితో జరిగిన భేటికి ఇది ఫాలో అప్ సమావేశంగా కనిపిస్తుంది, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.