iDreamPost
android-app
ios-app

స్టోలెన్ మస్ట్ వాచ్ థ్రిల్లర్.. ఇది కానీ మిస్ అయ్యారా ?

  • Published Jun 09, 2025 | 9:00 PM Updated Updated Jun 09, 2025 | 9:00 PM

OTT Suggestions: అదిరిపోయే ట్విస్ట్ లు , సస్పెన్స్ తో సినిమా అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. పైగా సినిమా నిడివి కూడా తక్కువే. గంటన్నర సేపు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుంది. అలాగే ఈ సినిమాను కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారట మేకర్స్.

OTT Suggestions: అదిరిపోయే ట్విస్ట్ లు , సస్పెన్స్ తో సినిమా అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. పైగా సినిమా నిడివి కూడా తక్కువే. గంటన్నర సేపు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుంది. అలాగే ఈ సినిమాను కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారట మేకర్స్.

  • Published Jun 09, 2025 | 9:00 PMUpdated Jun 09, 2025 | 9:00 PM
స్టోలెన్ మస్ట్ వాచ్ థ్రిల్లర్.. ఇది కానీ మిస్ అయ్యారా ?

ఓటిటి నిత్యం అనేక రకాల మూవీస్ వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని సడెన్ గా వచ్చిన మూవీస్ మాత్రం భలే థ్రిల్ ను ఇస్తాయి. వాటిలో ఈ వారం స్టోలెన్ అనే సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఏది ఏమైనా సరే కొన్ని మస్ట్ వాచ్ మూవీస్ ఉంటాయి. ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా ఎంటర్ అయింది. అదిరిపోయే ట్విస్ట్ లు , సస్పెన్స్ తో సినిమా అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. పైగా సినిమా నిడివి కూడా తక్కువే. గంటన్నర సేపు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుంది. అలాగే ఈ సినిమాను కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారట మేకర్స్.

సినిమా కథ అంతా కూడా ఓ చిన్న పాప కిడ్నాప్, అందులో అనుకోకుండా ఇరుక్కునే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ కొనసాగుతూ ఉంటుంది. కేవలం ఒకే రాత్రిలో సినిమా అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తూ చూస్తూ ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామా నుంచి అడ్వెంచరస్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. ఇక క్యాస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. తక్కువ రన్ టైం ఎక్కువ క్వాలిటీతో సినిమాను రూపొందించారు.

సినిమా స్టోరీ లైన్ ఏంటంటే ఓ ఊరి రైల్వే స్టేషన్ లో మహిళ పక్కన పడుకున్న పాపా ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది. అదే సమయంలో అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఆమెకు సాయం చేద్దాం అని అనుకుంటే ఈ కేసులో వారే ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏమైంది ? వారు ఆ కేసు నుంచి బయటపడ్డారు లేదా ? అసలు పాపా ఏమైంది ? చివరికి కథ ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అయినా సరే ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş