iDreamPost
android-app
ios-app

కుభేరకు ఏకంగా 10 కోట్ల కండిషన్.. !

  • Published Jun 09, 2025 | 10:50 AM Updated Updated Jun 09, 2025 | 10:50 AM

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సాంగ్స్ అన్నీ బాగానే మెప్పించాయి. సినిమా మీద అంచనాలను కూడా పెంచేశాయి. అయితే కుభేరకు సంబంధించి ఇంకాస్త వర్క్ పెండింగ్ ఉందట.

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సాంగ్స్ అన్నీ బాగానే మెప్పించాయి. సినిమా మీద అంచనాలను కూడా పెంచేశాయి. అయితే కుభేరకు సంబంధించి ఇంకాస్త వర్క్ పెండింగ్ ఉందట.

  • Published Jun 09, 2025 | 10:50 AMUpdated Jun 09, 2025 | 10:50 AM
కుభేరకు ఏకంగా 10 కోట్ల కండిషన్.. !

టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరి చేయి పైన ఉంటుందో చెప్పలేము. ఆ సమయం వస్తే ఎవరైనా చక్రం తిప్పొచ్చని అంటూ ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ బిజినెస్ లెక్కలను తమ గుప్పెట్లో ఉంచుకున్నాయి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్. ఒక్కసారి ఏదైనా సినిమాకు ఓటిటి డీల్ ముగిసింది అంటే ఇక ససేమీరా ఆ సినిమా చెప్పిన టైం కి థియేటర్ లో రిలీజ్ చేయాల్సిందే. లేదంటే ముందుగా కుదుర్చుకున్న ఓటిటి లెక్కల్లో తేడా వచ్చేస్తుంది. దీనితో మేకర్స్ లాస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆల్రెడీ కొన్ని సినిమాల విషయంలో జరిగింది కూడా.

ఇక ఇప్పుడు కుభేర విషయానికొస్తే.. సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సాంగ్స్ అన్నీ బాగానే మెప్పించాయి. సినిమా మీద అంచనాలను కూడా పెంచేశాయి. అయితే కుభేరకు సంబంధించి ఇంకాస్త వర్క్ పెండింగ్ ఉందట. ఈ పది రోజుల్లో ఇది అయితే సరే..అలా అని ఏ మాత్రం డిలే అయినా సినిమాకు 10 కోట్ల నష్టం వస్తుందట. ఎందుకంటే ఈ మూవీ ఓటిటి సంస్థ అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోను మూవీ జూన్ 20న రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆల్రెడీ కుభేర నిర్మాతలు ఈ విషయం గురించి ఓటిటి సంస్థతో డిస్కస్ చేశారట. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే కనుక ఏకంగా 10కోట్లు తగ్గిస్తామని చెప్పడంతో.. ఇప్పుడు కుభేర పెండింగ్ వర్క్స్ ను ఆగమేఘాల మీద కానిస్తున్నారట మేకర్స్. సో సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ లాస్ట్ మినిట్ వర్క్స్ మాత్రం స్పీడ్ గా జరుగుతున్నాయని టాక్. ఇక మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetherkülbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio