బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఇంకో నెలలో ముగియనుంది. పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువవ్వడంతో మొదట్లో దీనికి మిశ్రమ స్పందన దక్కినా ప్రభాస్ వచ్చాక ఒక్కసారిగా క్యాలికులేషన్స్ అన్నీ మారిపోయాయి. అసలు స్ట్రీమింగ్ మొదలుకాకుండానే క్రాష్ ఆయిన మొదటి తెలుగు యాప్ గా ఆహాకి డార్లింగ్ దెబ్బ గట్టిగానే తగిలింది. మరి రెండో ఎపిసోడ్ కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి. ఒక ఓటిటి టాక్ షో పైరసీ కాకుండా కోర్టు […]
కొద్దిరోజులుగా బీజేపీ నేతలు.. హిందుత్వ, జాతీయవాద సినిమాలను ప్రోత్సహిస్తూ తమకు తాము బ్రాండ్లుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని బీజేపీ ఓన్ చేసుకొని ఎంతగా ప్రచారం చేసుకుందో చూశాం.. ఇప్పుడు ‘శ్రీరాముడి’ని బేస్ చేసుకొని తీస్తున్న ‘ఆదిపురుష్’ మూవీని కూడా బీజేపీ అలానే వాడుకుంటోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా హీరో ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. కనీసం మాట్లాడడానికి కూడా తటపటాయిస్తాడు. […]
హిజాబ్, హలాల్ వివాదాలతో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందాలని యత్నిస్తుంటే.. ఆయా అంశాలతో బెంగుళూరుకు ఉన్న బ్రాండ్ ఇమేజీ దెబ్బతింటోందని తాజాగా నెలకొన్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. బయోటెక్, సాప్ట్వేర్ రంగాలకు రాజధాని బెంగుళూరు. కార్పొరేట్ కంపెనీలు మౌలిక వసతులతోపాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. అయితే గత నాలుగు నెలలుగా కర్ణాటకలో శాంతిభద్రతల అంశం దారితప్పింది. మొన్న హిజాబ్, ఇప్పుడు హలాల్ వివాదాలు కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. రైట్ వింగ్ సంస్థలు, బీజేపీ అనుబంధ సంస్థలు […]
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆరంభించిన పోరాటం దేశాన్ని కుదిపేస్తోంది. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం అవ్వడంలో రాజకీయ పార్టీలు కీలకపాత్ర పోషించాయి. ఎన్డీయేతర పార్టీలన్నీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ప్రత్యక్షంగా భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర […]
ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకున్నా గ్రేటర్లో టీఆర్ఎస్ అధికారం చేజిక్కుంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్లో తమకు తిరుగులేదనుకుంటున్న తరుణంలో ఎందుకిలా జరిగింది..? కారణాలేంటి..? భవిష్యత్‌లో మరింత బలపడాలంటే ఏం చేయాలి..? అన్న అంశాలపై టీఆర్ఎస్లో అంతర్మథనం జరుగుతోంది. 100 స్థానాల కంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ వర్గాలు 55 స్థానాలు పొందడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఫలితాలను పున:సమీక్షించుకుంటామని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ప్రకటించారు. ఇప్పటికే పార్టీలోని పలువురు […]
రోడ్డు మార్గాన సూర్యాపేట వెళ్లి… విద్యానగర్‌లో ఉన్న కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను ఓదార్చి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు భార్యకు రూ.4 కోట్లు, ఆయన తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కులను అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 చదరపు గజాల స్థలం, కమర్షియల్ ట్యాక్స్ అధికారి (గ్రూప్-1)గా ఉద్యోగ నియామక పత్రాలను సంతోష్‌బాబు భార్య సంతోషికి స్వయంగా అందజేశారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని […]
తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి, అధికార టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కెటిఆర్ అన్నారు. తనపై రాజకీయ కక్షపూరిత పిటిషన్ వేశారని, రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫాంహౌజ్ తనది కాదని స్పష్టం చేసి హైకోర్టుకు కెటిఆర్ నివేదించారు. నిజా […]
లాక్ డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణలో కరోనా కేసుల జోరే కాదు.. రాజకీయ పోరూ పెరుగుతోంది. మొన్నటి వరకూ తెలంగాణ పీసీసీ పీఠంపై కాంగ్రెస్ లో ఇంటిపోరు సాగగా… ఇప్పుడు కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో రాజుకున్న ఈ వేడి.. కరోనా నేపథ్యంలో కాస్త ఆగింది. సడలింపులతో ఇప్పుడు మళ్లీ రాజుకుంటోంది. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి […]
తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి, అధికార టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) ఫామ్ హౌస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఫామ్ హౌస్ ఆక్రమణ ఆరోపణలపై నిజ నిర్థారణ కమిటిని నియమించింది. జీఓ నెంబర్ 111 ఉల్లంఘనకి సంబంధించిన కేసులో కెటిఆర్ కు నోటీసులు జారీ చేసింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా జీవో 111ను ఉల్లంఘిస్తూ జన్వాడ పరిధిలో ఫామ్ హౌజ్ నిర్మించారంటూ […]
కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరైనా దగ్గినా, తుమ్మినా భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. జలుబు, దగ్గు కరోనా వైరస్ లక్షణాలు కావడమే ఇందుకు కారణం. సాధారణ ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు దగ్గినా తుమ్మినా వారి ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి పుకార్ల బారినపడ్డారు. నిన్న సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో ఆయన […]