iDreamPost
android-app
ios-app

KTRపై కేసు నమోదు.. త్వరలోనే నోటీసులు.. అసలేం జరిగిందంటే..!

  • Published Aug 16, 2024 | 9:05 AM Updated Updated Aug 16, 2024 | 9:05 AM

Notice To KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీద కేసు నమోదు చేశారు.. నోటీసులు అందజేశారు. ఆ వివరాలు మీ కోసం..

Notice To KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీద కేసు నమోదు చేశారు.. నోటీసులు అందజేశారు. ఆ వివరాలు మీ కోసం..

  • Published Aug 16, 2024 | 9:05 AMUpdated Aug 16, 2024 | 9:05 AM
KTRపై కేసు నమోదు.. త్వరలోనే నోటీసులు.. అసలేం జరిగిందంటే..!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాజకీయాల్లో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేదు. ఎక్కడ ఉన్నా సరే.. దూసుకుపోతుంటారు. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడంతో.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తూ.. ప్రజల తరఫున పోరాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ మీద కేసు నమోదు అయ్యింది. ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరి ఇంతకు ఏం జరిగింది.. అంటే..

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్కీమ్‌కు సంబంధించి.. మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అంతేకాక కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ న్ సీరియస్‌ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ చేసిన పోస్టును సుమోటోగా స్వీకరించినట్టుగా తెలిపిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేటీఆర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని.. అందులో ఆయన మహిళల పట్ల చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నయని కమిషన్ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

Case filed on KTR

ఈ పోస్ట్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు బాధ కలిగించేలా ఉన్నట్లు కమిషన్ గమనించిందని నేరెళ్ల శారద తెలిపారు. మహిళా కమిషన్ చట్టం ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం కమిషన్ ఈ అంశంపై స్వయంచాలకంగా విచారణను ప్రారంభించిందని నేరెళ్ల శారద ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇంతకు కేటీఆర్‌ ఎలాంటి కామెంట్స్‌ చేశారు.. ఎందుకు అనే వివరాలకు వస్తే..  ఉచిత బస్సు స్కీంలో భాగంగా మహిళలు.. ప్రయాణాల్లో రకరకాల పనులు చేస్తుండటంపై స్పందిస్తూ.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌.. సీతక్క వ్యాఖ్యల మీద సెటైర్లు వేస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మహిళలు ఎలాంటి పనులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదంటూనే.. డిస్కో డ్యాన్సులు చేసినా, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నా తమకు ఎలాంటి సమస్య లేదన్నారు కేటీఆర్‌. ఈ వ్యాఖ్యలపై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Case filed on KTR

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్.. తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌ అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా.. అంటూ ఆమె ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్‌కు ఇసుమంత గౌరవం కూడా లేదని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందన్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్‌లు కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.