Arjun Suravaram
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..తనదైన శైలీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటారు. తాజాగా కరీంనగర్ లోకూడా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ దూసుకెెళ్తున్నారు. సామాన్యులతో కలుస్తూ...వారితో కలిసి టీ తాగుతూ తన ప్రచారం సాగిస్తున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..తనదైన శైలీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటారు. తాజాగా కరీంనగర్ లోకూడా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ దూసుకెెళ్తున్నారు. సామాన్యులతో కలుస్తూ...వారితో కలిసి టీ తాగుతూ తన ప్రచారం సాగిస్తున్నారు.
Arjun Suravaram
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందండి వేరే లేవల్ ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరం వేడీ చల్లారక ముందే.. లోక్ సభ ఎలక్షన్ హీట్ ప్రారంభమైంది. ఇక్కడ త్రికోణ పోరు స్పష్టంగా కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మోజారీ ఎంపీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సామాన్యులతో ముచ్చటిస్తూ…తనదైన శైలీలో ప్రచారం చేస్తున్నారు. టీ తాగుతూ, రైతులతో ముచ్చటిస్తూ ప్రచారం చేశారు.
కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్‌కు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రజలతో ముచ్చటిస్తూ. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలానే బీఆర్ఎస్ కి అత్యధిక స్థానాలు ఇస్తే.. జరిగే మంచి ఏంటనేది వివరిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని రైతుబజార్‌లో పర్యటించిన ఆయన రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని వారిని కోరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు.
ఇక ప్రచారం సందర్బంగా పట్టణంలోని ఓ హోటల్ లో స్థానికులతో కలిసి కేటీఆర్ చాయ్ తాగారు. అలానే కాసేపు అక్కడ ఉన్న స్థానికులతో మాటమతి చేశారు. తాను ఓట్లు అడిగేందుకు రైతు బజారుకు వచ్చానని తెలిపారు కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని అక్కడి రైతులు కోరారని తెలిపారు. 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో వినోద్ కుమార్ తప్పకుండా గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇలా ఎన్నికల పోలింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్ది.. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో బిజీగా ఉన్నాయి. ఎవరిక వారే అత్యధిక స్థానాలు మావే అంటే మావే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ సామాన్యులతో అనేక సార్లు ఇలా ముచ్చటించడం జరిగింది. తనదైన శైలీలో ప్రచారం చేస్తూ కేటీఆర్ ఎన్నికల్లో దూసుకెళ్తుంటారు. ప్రస్తుతం కరీంనగర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు 4వ విడతలో పోలింగ్ జరగనుంది. మే 13 తేదీన ఎన్నికల జరగనున్నాయి. అలానే జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మరి..ఈసారి ఎక్కువ స్థానాల్లు ఎవరు గెలుస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది.