iDreamPost
android-app
ios-app

R. Narayana Murthy: ఆర్ నారాయణమూర్తిని పరామర్శించిన KTR.. ఆరోగ్యంపై ఆరా

R Narayana Murthy.. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనారోగ్యం బారిన పడిన సంగతి విదితమే. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

R Narayana Murthy.. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనారోగ్యం బారిన పడిన సంగతి విదితమే. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

R. Narayana Murthy:  ఆర్ నారాయణమూర్తిని పరామర్శించిన KTR.. ఆరోగ్యంపై ఆరా

పీపుల్స్ స్టార్, దర్శకుడు కమ్ నటుడు ఆర్ నారాయణ మూర్తి మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుప్రతిలో చేరారు. ఆయనకు అస్వస్థతగా ఉందని, ఆసుప్రతిలో చేరారని వార్తలు వెలువడగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తన తన ఆరోగ్యం పట్ల ఎవరు ఆందోళన చెందొద్దని నారాయణ మూర్తి మీడియాకు తెలియజేశారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఆర్ నారాయణ మూర్తి ఆరోగ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఆర్ నారాయణ మూర్తికి ఫోన్ చేసి పరామర్శించారు.

సీనియర్ నటుడు నారాయణ మూర్తి అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనకు కేటీఆర్ ఫోన్ చేసి పలకరించారు. అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ పీపుల్స్ స్టార్ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో చికిత్స పొందారు. ఇదిలా ఉంటే.. ఆయనకు ఆరోగ్యం కాస్తంత కుదుటపడినట్లు సమాచారం. పూర్తిగా కోలుకున్న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. బయటకు వచ్చిన ఆయన.. తనకు సేవలు అందించిన వైద్య బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇక ఆయన సినిమాల విషయానికే వస్తే.. సినిమా అంటే కమర్షియల్ కాదని, ప్రజలకు తన సినిమాలు మేలుకొలుపులా ఉండాలని భావించిన ఏకైన నటుడు కమ్ దర్శకుడు. ప్రజల సమస్యలను ఎజెండా తీసుకుని చిత్రాలు తెరకెక్కించాడు.

శ్రామిక, కర్షక వర్గం కోసమే ఆయన సినిమాలు చేశాడు. దర్శకుడు దాసరి నారాయణరావు శిష్యుడైన ఆర్ నారాయణ మూర్తి.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. 1970వ దశకం నుండే సినిమాల్లో నటిస్తున్నాడు. వామపక్ష భావాజాలం అనుసరించే ఈ నటుడు.. డబ్బు కోసం కాకుండా.. తన సిద్దాంతాలకు కట్టుబడి సినిమాలు తెరకెక్కిస్తుంటారు. లాల్ సలామ్, దండోరా, ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, చీమల దండు, ఎర్రోడు, సింగన్న, చీకటి సూర్యులు, ఛలో అసెంబ్లీ, భీముడు, వేగు చుక్కలు, వీర తెలంగాణ, పీపుల్స్ వార్, దండ కారణ్యం, రైతన్న, యూనివర్శిటీ చిత్రాల వరకు ప్రజా కోణమే కనిపిస్తుంది. ఆయనకు ఇప్పటికి సొంత వాహనం లేదు. ఆయన బ్యాచ్ లర్.