iDreamPost

TRS కార్యకర్తకు రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో స్పందించిన KTR

మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ కార్యకర్త గాయపడగా క్షణాాల్లో స్పందించి సాయం అందిస్తామని వెల్లడించారు.

మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ కార్యకర్త గాయపడగా క్షణాాల్లో స్పందించి సాయం అందిస్తామని వెల్లడించారు.

TRS కార్యకర్తకు రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో స్పందించిన KTR

తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కే తారకరామా రావు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదవచ్చిందని తెలిస్తే క్షణం ఐనా ఆగకుండా సాయమందించే కేటీఆర్ ఎంతో మంది జీవితాల్లో వెలుగులను నింపారు. ప్రజలతో పాటు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు కేటీఆర్. అధికారంలో ఉన్నా లేకున్నా సేవాగుణాన్ని మాత్రం మరువలేదు కేటీఆర్. ఇందుకు నిదర్శనమే తాజాగా కేటీఆర్ స్పందించిన తీరుకు అద్దంపడుతోంది. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఓ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. దీనిపై క్షణాల్లో స్పందించిన కేటీఆర్ అతన్ని ఆదుకుంటానని వెల్లడించారు.

బీఆర్ ఎస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలున్న విషయం తెలిసిందే. కార్యకర్తల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోంది. కార్యకర్తలను ఆపద సమయంలో ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. ఇదే కాకుండా ప్రమాదభారిన పడిన కార్యకర్తలను కుటుంబంలా భావించి తక్షణ సాయాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండీ మౌలానా అనే బీఆర్ ఎస్ కార్యకర్త కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం. కాగా ఇతను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గాలి అనిల్ కుమార్ నిర్వహించిన రోడ్ షోకు వెళ్లి వస్తుంటే ఆక్సిడెంట్ భారిన పడ్డాడు.

ఈ ప్రమాదంలో మౌలానా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తలకు తీవ్రగాయం కాగా 30 కుట్లు పడ్డాయి. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.పేదకుటుంబానికి చెందిన మౌలానా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఇంటికి ఆధారమైన ఇతడు ప్రమాదానికి గురికావడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఇతనికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ సమయంలో మౌలానా కుటుంబం సాయం కోసం ఎదురుచూస్తున్నది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనిపై క్షణాల్లోనే స్పందించిన కేటీఆర్ మౌలానాకు సాయం చేస్తామని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి