iDreamPost
android-app
ios-app

24 ఏళ్ల ప్రస్థానం.. తాజా ఫలితాలపై KTR ట్వీట్! పోస్ట్ వైరల్..

  • Published Jun 04, 2024 | 7:57 PM Updated Updated Jun 04, 2024 | 7:57 PM

Telangana Lok Sabha Results 2024: తెలంగాణ లోక్ సభ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఫలితాలపై ఆయన ఏమన్నారంటే?

Telangana Lok Sabha Results 2024: తెలంగాణ లోక్ సభ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఫలితాలపై ఆయన ఏమన్నారంటే?

24 ఏళ్ల ప్రస్థానం.. తాజా ఫలితాలపై KTR ట్వీట్! పోస్ట్ వైరల్..

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో BRS పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో నుంచి ఇంకా బయటపడక ముందే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం ఓ స్థానంలో విజయం సాధించింది. ఇక తాజాగా వెలువడిన షాకింగ్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాలపై కేటీఆర్ ఏమన్నారంటే?

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ సత్తాచాటాయి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ కు షాకిచ్చారు ప్రజలు. 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. అదీకాక ఎక్కడా కూడా కనీసం రెండో స్థానంలో నిలబడలేకపోయింది. కాగా.. ఎన్నికల ప్రచారం లో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని తెలిపారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అందుకు భిన్నంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఘోర ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

లోక్ సభ ఫలితాలపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.. “24  ఏళ్ల పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఎన్నో ఓటములను, అద్భుతమైన విజయాలను చూశాం. అయితే తెలంగాణ సాధించడమే తమ పార్టీకి అతిపెద్ద విజయం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం అసెంబ్లీలో కూడా 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. అయితే తాజాగా వచ్చిన ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయితే ఎప్పటిలాగే కష్టపడి మరింత పైకి ఎదుగుతాం. భవిష్యత్ లో బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా తప్పకుండా పైకి లేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఈమేరకు ఆయన ట్విట్ చేశారు. మరి లోక్ సభ ఫలితాలపై, కేటీఆర్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.