iDreamPost
android-app
ios-app

వీడియో: కిన్నెర మొగిలయ్యకు KTR ఆర్థిక సాయం!

  • Published May 05, 2024 | 5:34 PM Updated Updated May 05, 2024 | 5:34 PM

Singer Kinnera Mogilaya: తెలంగాణలో 12 మెట్ల కిన్నెర గానంతో పాపులర్ అయ్యారు కిన్నెర మొగిలయ్య అలియాస్ దర్శనం మొగులయ్య. ఆయన జీవిత చరిత్ర 8వ సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉండటం విశేషం.

Singer Kinnera Mogilaya: తెలంగాణలో 12 మెట్ల కిన్నెర గానంతో పాపులర్ అయ్యారు కిన్నెర మొగిలయ్య అలియాస్ దర్శనం మొగులయ్య. ఆయన జీవిత చరిత్ర 8వ సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉండటం విశేషం.

వీడియో:  కిన్నెర మొగిలయ్యకు KTR  ఆర్థిక సాయం!

ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య ఒకరు. తెలగాణంలో పలు గ్రామాల్లో తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాలుగా కిన్నెర గానంతో పాటలు పాడుతున్నా ఆయనకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. 2021 లో పవన్ కళ్యాన్ నటించిన ‘బీమ్లా నాయక్’ మూవీలో ‘శభాష్.. ఆడాగాదు.. ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అనే పాట ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత మొగిలయ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఈ మద్య మొగిలయ్య ఆర్థిక కష్టాలు అంటూ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆయని కలిశారు. వివరాల్లోకి వెళితే..

పద్మక్ష అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాడని.. ఈ క్రమంలోనే ఆయన ఇంటి నిర్మాణ పనుల్లో కూలీగా వెళ్తున్నారంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్ లో కూలీ పని చేస్తూ కనింపిచారని ఫోటోలు, వీడియోల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో మొగిలయ్య మాట్లాడుతూ.. ‘ నా కొడుకుల్లో ఒకరికి మూర్ఛవ్యాధి ఉంది.. నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు. మందుల కోసం నెలకు కనీసం రూ.7 వేల అవరసం. నా మీద ఆధారపడే నా కుటుంబం ఉంది.. అందుకే కూలీ పనులు చేస్తూ కాస్తో కూస్తో సంపాదిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. తాజాగా కిన్నెర మొగిలయ్యను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కలిశారు.

ఆదివారం దర్శనం మొగిలయ్యను కేటీఆర్ ప్రత్యేకంగా కలిశారు..ఈ సందర్భంగా ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ఇటీవల మొగులయ్య కూలీ పనులు చేస్తున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంత.. గత ప్రభుత్వం అందించిన కళాకారుల పెన్షన్ ఆపివేశారన్న వార్తలు రావడంపై స్పందిచిన కేటీఆర్.. మొగులయ్యను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ తో పాటు అన్ని హామీలు నెరవేర్చాలని రాష్ట్ర సర్కార్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.ఆర్థిక సాయం అందించిన కేటీఆర్ కి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మొగులయ్యను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా కలిశారు.. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మొగులయ్య పాట కూడా పాడారు. దీనికి సంబంధించిన వీడియో వైలర్ అయ్యింది. మొగులయ్య సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.