iDreamPost
android-app
ios-app

AP ఎన్నికల్లో గెలుపు జగన్‌దే.. ఆ పార్టీకి ఒక్కటే MP సీటు: KTR

  • Published May 16, 2024 | 8:34 AMUpdated May 16, 2024 | 8:34 AM

AP Elections 2024: ఏపీ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

AP Elections 2024: ఏపీ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published May 16, 2024 | 8:34 AMUpdated May 16, 2024 | 8:34 AM
AP ఎన్నికల్లో గెలుపు జగన్‌దే.. ఆ పార్టీకి ఒక్కటే MP సీటు: KTR

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో దశంలో భాగంగా.. సోమవారం అనగా మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటింగ్‌ నిర్వహించగా.. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఏపీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ నమోదయ్యింది. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలకి మించి పోలింగ్‌ నమోదయ్యింది. ఓటేసేందుకు జనాలు పోటేత్తారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యింది. ఇక జూన్‌ 4న ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. తాజాగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది జగనే అని కేటీఆర్‌ స్పష్టం చేశాడు. దీనిపై తమకు సమాచారం ఉందన్నారు. అంతేకాకుండా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం ఒకే స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తాను ప్రత్యేకంగా సర్వే చేయించానని బీఆర్ఎస్‌కు అధిక స్థానాలు వస్తాయని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో తాను మాట్లాడినట్లు ఈసందర్భంగా కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు చాలా బాగా జరిగాయని.. తాను చేయించిన ప్రత్యేక సర్వేలో.. ఓటింగ్ అంతా బీఆర్ఎస్‌కు అనుకూలంగా పడినట్లు.. ఆ సర్వే రిపోర్ట్ వెల్లడించిందన్నారు కేటీఆర్‌. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పక్కగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలానే పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా పోరు సాగిందని చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగిన తర్వాత.. తమ పార్టీని చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడ్డాయని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. ఇవి తెలంగాణలో త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు కేటీఆర్‌. కేవలం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి