మధ్యప్రదేశ్‌లో రెండు వారాల క్రితం ప్రత్యర్థి పార్టీల అగ్రనాయకులు కనిపించటం లేదని అధికార బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోస్టర్ల యుద్ధం జరిగింది. ఈ ఉదంతంపై రాజకీయ వర్గాలలో ఇంకా చర్చ నడుస్తుండగా తాజాగా సీఎం శివరాజ్ చౌహాన్ ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారి ప్రకంపనలు సృష్టిస్తుంది. త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. జ్యోతిరాదిత్య సింధియాకు అత్యంత సన్నిహితుడైన సిలావత్ ఇండోర్‌లోని సాన్వర్ నియోజకవర్గం నుంచి బిజెపి […]
మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన 15 నెలలకే ముగిసింది. మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ కొలువుతీరనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా.. అవకాశాలు మాత్రం మూసుకుపోలేదని చెప్పవచ్చు. మరో ఆరు నెలల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు దారుంది. అయితే ఆ దారి.. మధ్య […]
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కి షాక్ ఇస్తూ బెంగుళూరు క్యాంపులో ఉన్న జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ బలం 92 కి పడిపోయింది. సభలో ప్రస్తుత బలబలాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 22 మంది, బిజెపికి చెందిన ఒక సభ్యుడి రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 207 కి పడిపోయింది. దీనితో ప్రస్తుత బలబలాలను […]
మధ్య ప్రదేశ్ రాజకీయం పలు మలుపులు తిరుగుతుంది.గవర్నర్ లాల్జీ టాండన్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా, బలపరీక్షను కొంతకాలం తప్పించడానికి ఈ నెల 26 వరకూ కరోనా నెపంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీని స్పీకర్ ప్రజాపతి వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో బీజేపీ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నేతృత్వంలో సుప్రీం కోర్టులో తక్షణం బలపరీక్ష జరపాలని పిటిషన్ దాఖలు చేసారు. ఈరోజు సుప్రీం కోర్టులో బీజేపీ […]
మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో శాసనసభలో తమ బలం నిరూపించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాధ్ కి గవర్నర్ లాల్జీ టాండన్ వార్నింగ్ ఇచ్చారు. లేనిపక్షంలో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని భావించాల్సి ఉంటుందని గవర్నర్ హెచ్చరించారు. కాగా సోమవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని లేఖ ద్వారా స్పీకర్ కు గవర్నర్ సూచించినప్పటికీ స్పీకర్ మాత్రం ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న […]
మధ్యప్రదేశ్ అసెంబ్లీని ఈ నెల 26 వరకూ స్పీకర్ ప్రజాపతి కరోనా వైరస్ కారణంగా చూపుతూ వాయిదా వేయడంతో బలపరీక్ష మరికొద్ది రోజులు వాయిదా పడింది. కాగా ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించమని గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్ కి సూచించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు […]
మధ్యప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంకృత అపరాధమే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ విషయంలో అన్ని వేళ్ళు కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతనే ఎత్తి చూపుతున్నాయి. కష్టకాలంలో పార్టీలో సంస్థాగతంగా స్థానిక యువనాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీకి జవసత్వాలు కల్పించాల్సింది పోయి, ఎంతసేపటికి భజనపరులకే ప్రాధాన్యమిస్తూ వారినే అందలం ఎక్కించడం వల్లనే పార్టీ కి ఈ దుస్థితి దాపురించిందని సాక్షాత్తు కొందరు కాంగ్రెస్ సీనియర్ […]
అందరూ అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బిజెపిలో చేరిన యువనేత, మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ నుండి తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసింది. సింధియా బిజెపిలో చేరి 24 గంటలు కూడా గడవకముందే ఈరోజు పార్టీ అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో సింధియాకు చోటు దక్కింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియా అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయిందని […]
కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికున్న నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధానికి తెరదించుతూ మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎట్టకేలకు బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ బీజేపీలో చేరడం ద్వారా తనకు దేశానికి సేవ చేయడానికి మరింతగా అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం దేశ భవిష్యత్తు భవిష్యత్తు ప్రధాని మోడీ చేతిలో సురక్షితంగా ఉందని జ్యోతిరాదిత్య సింధియా అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా […]
దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో అర్థ శతాబ్దం పాటు శాసించిన పార్టీ ఇప్పుడు శిథిల స్థితికి చేరుతోంది. కాంగ్రెస్ కోటలు కూలుతున్నాయి. ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన విజయం కూడా నిలబెట్టుకోలేని దశలో ఆపార్టీ కనిపిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ ఓ ఉదాహరణ అయితే ఆ తర్వాత రాజస్తాన్ కూడా అదే బాటలో సాగే ప్రమాదం దాపురిస్తోంది. అంతకుముందే ఆంధ్రప్రదేశ్ , అరుణాచల్ ప్రదేశ్ అనుభవాలు కూడా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడానికి అసలు కారణం ఆపార్టీ అధిష్టానం […]