iDreamPost
android-app
ios-app

సంక్షోభంలో మధ్య ప్రదేశ్ సర్కార్-రాజీనామా చేసిన 19 మంది ఎమ్మెల్యేలు

సంక్షోభంలో మధ్య ప్రదేశ్ సర్కార్-రాజీనామా చేసిన 19 మంది ఎమ్మెల్యేలు

మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడింది. జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే, మధ్య ప్రదేశ్ లో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కారు కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా కమల్ నాథ్ సర్కారుపై జ్యోతిరాదిత్య సింథియా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాగా తాజాగా తన వర్గం ఎమ్మెలేలతో కలిసి తిరుగుబాటు చేసిన జ్యోతిరాదిత్య సింథియా ఈరోజు అమిత్ షా తో కలిసి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సింథియా ప్రకటించి రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిఅధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.

Read Also: కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింథియా రాజీనామా

ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ సింథియాను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. జ్యోతిరాదిత్య సింథియా రాజీనామా అనంతరం 21 మంది కాంగ్రెస్ ఎమ్మెలేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కారు కూలడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. జ్యోతిరాదిత్య సింథియా బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.

Read Also: చిన్న రాజా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడా?

230 సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది, భాజపాకు 107 మంది సంఖ్యాబలం ఉంది. స్వతంత్ర సభ్యులు నలుగురు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సమాజ్‌వాదీకి చెందిన ఒకరు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 21 మంది రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ బలం 93కు పడిపోతుంది.